Entertainment

A Cup of Coffee: ఒక యంగ్‌స్టర్ జర్నీ..

గీత సుబ్ర‌మ‌ణ్యం’ (Geetha Subrahmanyam) ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు (Manoj Krishna Tanneeru), జయశ్రీ (Jayasri) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎ క‌ప్ ఆఫ్ టీ’ (A Cup of Coffee). యూత్‌ను ఆకట్టుకునే క‌థాంశంతో..

A Cup of Coffee: ఒక యంగ్‌స్టర్ జర్నీ..

‘గీత సుబ్ర‌మ‌ణ్యం’ (Geetha Subrahmanyam) ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు (Manoj Krishna Tanneeru), జయశ్రీ (Jayasri) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎ క‌ప్ ఆఫ్ టీ’ (A Cup of Coffee). యూత్‌ను ఆకట్టుకునే క‌థాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. నూతన దర్శకులు ఎఫ్‌పీ రోజ‌ర్స్‌ (FP Rogers), నిఖిత రావు (Nikitha Rao) సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్టిస్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై మ‌నోజ్ కృష్ణ‌ (Manoj Krishna), న‌వీన్ కృష్ణ (Naveen Krishna) నిర్మించారు. ఈ మూవీ నుంచి వాట్ హ్యాపెండ్ అనే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో మనోజ్ (Hero Manoj) మాట్లాడుతూ.. తమ సినిమాను ఈ ప్రమోషనల్ సాంగ్ (Promotional Song) ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాలని తాము భావించినట్టు తెలిపాడు. పెద్ద సినిమాల కారణగా చిన్న సినిమాలు ఇబ్బంది పడతాయనే విషయాన్ని ఈ పాటలో ఫన్నీగా చూపించినట్టుగా వెల్లడించాడు. ఈ సినిమా ఒక యంగ్‌స్టర్ జర్నీ అని.. కాలేజ్ యువత జర్నీ ఎలా ప్రారంభమై ఎలా డీవియేట్ అవుతుంది? తద్వారా వచ్చే పరిణామాలను ఈ చిత్రంలో చూపించినట్టుగా మనోజ్ తెలిపాడు. నేటి యువత తప్పక చూడాల్సిన చిత్రం ఇదని వెల్లడించాడు. గీత సుబ్ర‌మ‌ణ్యం త‌ర్వాత మ‌ళ్లీ తనకు అంత హై ఇచ్చిన చిత్రం ఇది కాబోతుందని మనోజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తిక్ రోడ్ర‌విజ్‌ మాట్లాడుతూ.. తమది చిన్న సినిమా అయినా కూడా మ్యూజిక్‌, మేకింగ్ కోసం మ‌నోజ్ చాలా ఖ‌ర్చు పెట్టాడని తెలిపారు. పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వ‌చ్చిందన్నారు. ద‌ర్శ‌కులు, టీమ్ అంతా చాలా కష్టపడి మంచి ఔట్‌పుట్ తీసుకువ‌చ్చారన్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ క‌మ‌ల్ నాబ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాకి మ‌నోజ్ ఒక్క‌డే వ‌న్ మ్యాన్ ఆర్మీగా మారి.. అన్నీ తానై చూసుకున్నాడని పేర్కొన్నారు. ఈ సినిమా బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ.. ఒక లైఫ్ స్టోరీ అని కమల్ నాబ్ తెలిపారు. నటుడు రాకేష్ మాట్లడుతూ.. తాను మనోజ్‌కి చాలా పెద్ద అభిమానినని.. ‘గీత సుబ్ర‌మ‌ణ్యం’ సిరీస్‌ టైమ్‌లో త‌న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉండేదో తనకు తెలుసన్నారు. ఎలాంటి వ‌ల్గారిటీ లేని ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టోరీ ఇదని పేర్కొన్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 25, 2025 3:14 PM