Entertainment

టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగం.. తొలి ఏఐ సినిమాగా ‘అంబ’s రివెంజ్”

ప్రస్తుతం ఏఐ కాలం నడుస్తోంది. ఇది చలనచిత్ర పరిశ్రమలోకి సైతం చొచ్చుకు వచ్చేసింది. సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఓ తెలుగు ఫీచర్ ఫిల్మ్ రూపొందిది. అదే..“అంబ’s రివెంజ్”.

టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగం.. తొలి ఏఐ సినిమాగా ‘అంబ’s రివెంజ్”

ప్రస్తుతం ఏఐ కాలం నడుస్తోంది. ఇది చలనచిత్ర పరిశ్రమలోకి సైతం చొచ్చుకు వచ్చేసింది. సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఓ తెలుగు ఫీచర్ ఫిల్మ్ రూపొందిది. అదే..“అంబ’s రివెంజ్”. పూర్తి స్థాయి ఏఐ సహకారంతో శ్రీకాంత్ రెడ్డి కుందూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా తెరకెక్కిస్తున్నారు. మహాభారతంలోని అంబ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఆ అంబ కథ ఆధారంగానే రూపొందించారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు, క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. “అంబ’s రివెంజ్” ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగిస్తూ విజువల్స్‌, పాత్రల రూపకల్పన, కథ నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఏఐ ఆధారంగా ఈ చిత్రం రూపొందడం.. అది కూడా టాలీవుడ్‌లో తొలిసారి అని చెప్పాలి. ఈ సరికొత్త ప్రయోగం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలగడం ఖాయం.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 2, 2026 9:47 AM