Vijay Devarakonda - Rashmika: విజయ్-రష్మికల పెళ్లి వేడుక పేరేంటంటే..
ఇక పెళ్లి విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది లేదని అనుకుంటున్న తరుణంలో వివాహ ప్రకటన వచ్చేసింది. ఇద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట రాజస్థాన్‌కు పయనమైంది. ఆ వీడియోతో మరో ప్రకటన కూడా చేశారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలొస్తున్నా కూడా ఎందుకో అసలు ఇద్దరూ స్పందించలేదు. ఎంగేజ్‌మెంట్ కూడా సీక్రెట్‌గానే చేసుకున్నారు. ఇక పెళ్లి విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది లేదని అనుకుంటున్న తరుణంలో వివాహ ప్రకటన వచ్చేసింది. ఇద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట రాజస్థాన్‌కు పయనమైంది. ఆ వీడియోతో మరో ప్రకటన కూడా చేశారు.
విజయ్-రష్మికల వివాహం గురువారం రాత్రి జరుగనున్నట్టు తెలుస్తోంది.. వీరి పెళ్లి వేడుకకు పేరు కూడా పెట్టారు. ‘ది వెడ్డింగ్స్ ఆఫ్ విరోష్’ పేరును తమ పెళ్లి వేడుకకు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. సోమవారం ఉదయం ఈ జంట రాజస్థాన్‌కు వెళుతూ ఎయిర్‌పోర్టులో సందడి చేసింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో విజయ్ - రష్మికల వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇక వివాహ తంతు వచ్చేసి రేపటి (మంగళవారం) నుంచే ప్రారంభం కానుంది.
హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలన్నీ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 26వ తేదీన వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్, రష్మిక హైదరాబాద్ నుంచి బయలుదేరగా.. ఆనంద్ దేవరకొండ, వీరిద్దరి స్నేహితులు ఉన్నారు. వీరంతా ఎయిర్‌పోర్టులో సందడి చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విరోష్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.