Entertainment

Raj Dasireddy: ఈ తెలుగు హీరోకి అదృష్టం లక్కలా పట్టేసింది.. ఏకంగా ఆస్కార్‌లోనే మెరిశాడు..

‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్‌ను అందుకుని ప్రపంచంతో ‘నాటు నాటు’ స్టెప్పేయించింది. పోనీలే ఈ జన్మకు ఇది చాలన్నట్టుగా దక్షిణాది వారంతా సంబరాలు చేసుకున్నారు. కానీ ముచ్చటగా మూడేళ్లు తిరగకముందే తెలుగు హీరో ఆస్కార్‌ (Oscar)లో సందడి చేసి హాట్ టాపిక్ అయ్యాడు.

Raj Dasireddy: ఈ తెలుగు హీరోకి అదృష్టం లక్కలా పట్టేసింది.. ఏకంగా ఆస్కార్‌లోనే మెరిశాడు..

ఏ రంగంలో అయినా రాణించాలంటే.. విపరీతంగా కష్టపడేతత్వంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని చెబుతారు. కానీ ఈ యంగ్ హీరోకి ఆవగింజంతేంటి.. అంతులేనంత అదృష్టం ఉన్నట్టుంది. మన తెలుగు వారు ఆస్కార్‌ బరిలోకి అడుగు పెట్టడమే చాలా చాలా కష్టం. ఆ మాటకొస్తే తెలుగు కాదు.. దక్షిణాది వారికి అని చెప్పాలి. అలాంటిది ఎలాగో దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్‌ను అందుకుని ప్రపంచంతో ‘నాటు నాటు’ స్టెప్పేయించింది. పోనీలే ఈ జన్మకు ఇది చాలన్నట్టుగా దక్షిణాది వారంతా సంబరాలు చేసుకున్నారు. కానీ ముచ్చటగా మూడేళ్లు తిరగకముందే తెలుగు హీరో ఆస్కార్‌ (Oscar)లో సందడి చేసి హాట్ టాపిక్ అయ్యాడు.

టాలీవుడ్ నుంచి ఒక యంగ్ హీరో.. ఆరడుగుల అందగాడు తళుక్కున మెరిసి ఆశ్చర్యపరిచాడు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘నాటు నాటు’ సందడి చేస్తే.. 97వ అకాడమీ అవార్డ్స్‌లో మన తెలుగు హీరో సందడి చేశాడు. ఆ తెలుగు హీరో పేరు ‘రాజ్ దాసిరెడ్డి’. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల (Oscar Awards) మహోత్సవంలో మెరుస్తున్నారు. ఇలాంటి అవకాశం చాలా చాలా అరుదని చెప్పాలి. అలాంటి అవకాశాన్ని అందుకుని తిరిగి మరోసారి దక్షిణాదిని మొత్తం ఆకర్షించాడు. రాజ్ దాసిరెడ్డి (Raj Dasireddy).. ‘రాజాసాబ్’ (Rajasaab)తో పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్న మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) దర్శకత్వంలో ‘భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ’ (Bhadram Be Careful Brotheru) చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు.

ఆ తరువాత హాలీవుడ్‌లో అవకాశాలు చేజిక్కించుకుని అక్కడే సినిమాలు చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఒక తెలుగు హీరో.. అందునా తొలి చిత్రంతోనే హాలీవుడ్‌లో స్థానం సంపాదించుకోవడమంటే మాటలు కాదు. ఇప్పటి వరకూ ఏ తెలుగు హీరోకి పట్టని అదృష్టమిది. ఇదే అదృష్టమంటే మనోడు ఏకంగా ఆస్కార్‌లో మెరవడం సాధారణ విషయం కాదు. అదృష్టం లక్కలా పడితేనే సాధ్యం. ఇక హాలీవుడ్‌లో సందడి చేస్తున్న రాజ్‌కు ఆస్కార్ 2025 వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దీంతో రాజ్ అక్కడికి వెళ్లి ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్’ (Hollywood Walk of Fame), ‘న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ - 2025’ (Newyork Fashion Week 2025)లోనూ సందడి చేశాడు. ప్రస్తుతం హాలీవుడ్‌లో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం రాజ్ దాసిరెడ్డి సైన్ చేశాడు. ఈ క్రమంలోనే ఆ చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. మొత్తానికి తెలుగు జాతంతా రాజ్ దాసిరెడ్డిని చూసి గర్వపడుతోంది.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 22, 2025 8:31 AM