Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ విస్తుబోయే న్యూస్ ఇది..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విస్తుబోయే న్యూస్ ఇది.. మేకర్స్ తాజాగా ఓ కీలక అప్‌డేట్‌ను వదిలారు. వన్ ఏపీ డిప్యూటీ సీఎం కూడా అవడంతో ప్రజా సేవలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలో..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawankalyan) ఫ్యాన్స్ విస్తుబోయే న్యూస్ ఇది.. మేకర్స్ తాజాగా ఓ కీలక అప్‌డేట్‌ను వదిలారు. అదేంటంటే.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh)కి సంబంధించిన షూటింగ్‌ను పవన్ పూర్తి చేశారు. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM Pawan Kalyan) కూడా అవడంతో ప్రజా సేవలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం ఎప్పటికి పవన్ పూర్తి చేస్తారోనని అంతా భావించారు. కానీ తన సమయాన్ని షూటింగ్ (Ustaad Bhagat Singh Shooting) కోసం కూడా వెచ్చించి శరవేగంగా పూర్తి చేశారు. హరీష్ శంకర్ (Harish Shankar), పవన్ కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ (Gabbarsingh) చిత్రం మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ వీరిద్దరి కాంబో (Pawan Kalyan-Harish Shankar Combination Movie)లో చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఇటీవల తమ కాంబోలో సినిమా వస్తున్నట్టు హరీష్ శంకర్ ప్రకటించడం.. దానికో క్రేజీ టైటిల్‌ను పెట్టడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.
తాజాగా ఈ చిత్ర యూనిట్ ఒక భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌తోనే పవన్ (Pawan) తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు. వాస్తవానికి ఈ భారీ షెడ్యూల్‌ను అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే భావనతో దర్శకుడు హరీష్ శంకర్ (Director Harish Shankar)తో పాటు నటీనటులు అహర్నిశలు శ్రమించారు. అంతేకాకుండా టాకీ పార్ట్‌లోనూ ఎక్కువ భాగం పూర్తైంది. అంచనాలకు తగినట్టుగా చిత్రాన్ని రూపొందించడం కోసం మేకర్స్ ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల (Srileela), రాశిఖన్నా (Rasikhanna) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి సినిమా షూటింగ్ అయితే చివరి అంకానికి చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ (Post Production Work) కార్యక్రమాలను మేకర్స్ త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పుడు వదిలేది త్వరలోనే తెలియనుంది. మొత్తానికి సినిమా షూటింగ్‌కు సైతం త్వరలోనే మేకర్స్ గుమ్మడికాయ కొట్టనున్నట్టు సమాచారం.
ప్రజావాణి చీదిరాల