Mega Family: వీడియోతో మెగా ఫ్యామిలీ గుడ్ న్యూస్.. అల్లు ఫ్యామిలీ ఎక్కడ?
మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మినహా అంతా కనిపించారు. అయితే అల్లు ఫ్యామిలీ (Allu Family)కి చెందిన వ్యక్తులెవరూ వీడియోలో కనిపించకపోవడం ఆసక్తికరం.

ఒక వీడియోతో మెగా ఫ్యామిలీ (Mega Family) గుడ్ న్యూస్ పంచుకుంది. అదేంటంటే.. రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా ఉపాసనకు మెగా ఫ్యామిలీ సీమంతం నిర్వహించింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు నాగార్జున (Nagarjuna) ఫ్యామిలీ, విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ఫ్యామిలీ హాజరైంది. ఇక మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మినహా అంతా కనిపించారు. అయితే పవన్ రాజకీయాల కారణంగా ఈ వేడుకల్లో పాల్గొనలేదని తెలుస్తోంది. అల్లు ఫ్యామిలీ (Allu Family)కి చెందిన వ్యక్తులెవరూ వీడియోలో కనిపించకపోవడం ఆసక్తికరం. ఒకప్పుడు మెగా, అల్లు ఫ్యామిలీ అంటూ విడివిడిగా ఉండేది కాదు. కానీ ఆ తరువాత ఎందుకో రెండూ వేరైపోయాయి.
అయితే వేడుకలు.. లేదంటే ఇతర సమయాల్లో రెండు ఫ్యామిలీలు (Allu and Mega Family) కలిసే కనిపిస్తున్నాయి. కానీ ఈ వేడుకలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అల్లు అరవింద్ (Allu Arvind) తల్లిగారు మరణించిన సమయంలోనూ రెండు ఫ్యామిలీలు కలిసిపోయినట్టుగానే కనిపించాయి. కానీ ఇంతలోనే ఏమైంది? అసలు హాజరుకాలేదా? లేదంటే వీడియోలోనే కనిపించలేదా? విఘ్నేష్ శివన్ (Vignesh Shivan), నయనతార (Nayantara) దంపతులతో సహా ఉన్న వీడియోలో ఒక్క అల్లు ఫ్యామిలీని మాత్రమే ఎందుకు తప్పిస్తారు? కాబట్టి అసలు అల్లు ఫ్యామిలీయే హాజరు కాలేదని అంటున్నారు.
అల్లు అర్జున్ (Allu Arjun) మాట ఎలా ఉన్నా కూడా అల్లు అరవింద్ మాత్రం వస్తారే.. ఆయన కూడా కనిపించకపోవడమేంటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ తనకు తన మామ అల్లు అరవింద్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో కలిసి తిరిగేందుకు ఇష్టపడతానని తెలిపాడు. మరి అలాంటి మామ ఈ వేడుకకు ఎందుకు హాజరు కాలేదనేది అంతుబట్టడం లేదు. నాగార్జున, వెంకటేష్ వంటివారిని పిలిచినప్పుడు అల్లు ప్యామిలీని పిలవకుండా ఉండరు. వీళ్లు పిలిచారా? వాళ్లు వచ్చారా? వీడియోలో కనిపించలేదా? అన్నీ ప్రశ్నలే.. సమాధానాలే కరవు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతుందా? క్లీంకారకు చెల్లి పుడుతుందా? తమ్ముడు పుడతాడా? అని నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.
ప్రజావాణి చీదిరాల