VK Naresh: లివ్ ఇన్ రిలేషన్ ట్రెండ్ కూడా పోయింది.. ఎంజాయ్ చేసి విడిపోవడమే..
ఈ రోజుల్లో వివాహాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు సరికదా.. లివింగ్ రిలేషన్ ట్రెండ్ కూడా అయిపోయింది. కేవలం ఎంజాయ్ చేసి విడిపోతున్నారంతే..

అంకిత్ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యూటీ’. ఈ చిత్రంలో వీకే నరేష్, వాసుకి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈక్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో జోష్ పెంచారు మేకర్స్. ఇవాళ (మంగళవారం) వీకే నరేష్, వాసుకి మీడియాకు సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సీనియర్ నటుడు వీకే నరేష్ సినిమాకు ‘బ్యూటీ’ (Beauty Movie) గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు బ్యూటీ వచ్చేసి సోల్, థీమ్ మాత్రమే అన్నారు. సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ (Entertainment), ఎమోషనల్ (Emotional) మిక్స్ ఉంటుందన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆర్గానిక్ గా లేదని.. మీకనిపిస్తే లక్ష రూపాయలు ఇస్తానంటూ తాను ఛాలెంజ్ చేసిన విషయాన్ని నరేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంటర్వెల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ సినిమాను కుటుంబమంతా కూర్చొని చూడవచ్చన్నారు. ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న సమస్య అనేది ఉంటే ఉండొచ్చు కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటిదేమీ ఉండదన్నారు. ఈ సినిమాకు వానర సెల్యులాయిడ్స్ (Monkey Celluloids), జీ స్టూడియోస్ (Zee Studios) నుంచి నిమ్మకాయల ప్రసాద్ (Nimmakayala Prasad), మారుతీ స్టూడియోస్ (Maruthi Studios) ముగ్గురూ కలిసి త్రిమూర్తుల్లా పని చేశారని నరేష్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమా ప్రస్తుత జనరేషన్‌కు సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ రోజుల్లో వివాహాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు సరికదా.. లివింగ్ రిలేషన్ ట్రెండ్ (Livein Relation Trend) కూడా అయిపోయిందన్నారు. కేవలం ఎంజాయ్ చేసి విడిపోతున్నారంతే.. ఇప్పటి పిల్లలకు ఏమీ చెప్పేలా కూడా లేదని నరేష్ అన్నారు. తమను తాము చూసుకుంటారని.. ఈ రోజుల్లో మ్యారేజ్ గురించి ఎవరూ ఆలోచించట్లేదన్నారు. అదొక కమిట్మెంట్ అని.. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్, కలిసి ఎంజాయ్ చేసి విడిపోవడం అంతేనన్నారు. వాసుకిని నేచురల్‌గా చేయమని చెప్పడంతో ఆమె తన మెథడ్ యాక్టింగ్ పీక్స్ చూపించిందని తెలిపారు. కథ విన్నాక షాక్ అయ్యానని.. అసలు ఈ సినిమా తాను చేయగలనా అనే సందేహం వచ్చిందని పేర్కొన్నారు. చిన్న అపార్ట్మెంట్‌లో చాలా కష్టపడి షూట్ చేసామని... అలాగే ఓల్డ్ సిటీలో మట్టిలో తిరిగే సీన్స్ చేసినట్టు నరేష్ వెల్లడించారు.
నటి వాసుకి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎమోషన్ ఎంత కావాలో అంత ఉంటుందని.. మనం కూడా ఎంత రియాక్ట్ అవ్వాలో అంతే అవ్వాలన్నారు. తన కూతురితో కలిసి ఈ సినిమా చూశానని వాసుకి తెలిపింది. ఈ కథ విన్నాక తానొక తల్లిగా కనెక్ట్ అయ్యానని.. ఒక తల్లికి, అమ్మాయికి ఉండాల్సిన అవగాహన, బాధ్యత అన్నీ ఈ కథలో ఉన్నాయని వెల్లడించింది. పేరెంట్స్.. పిల్లలతో ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నా కూడా వారు ఎంతో కొంత మన దగ్గర దాస్తారని చెప్పింది. తన తల్లిదండ్రులిద్దరిదీ లవ్ మేరేజ్ అయినా కూడా తనతో వారిద్దరూ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా తాను కూడా వారి వద్ద కొన్ని విషయాలు దాచేద్దాన్నని వాసుకి తెలిపింది. ఈ సినిమాకు నరేష్ మెయిన్ పిల్లర్... ఈ సినిమా కథ ఇప్పటి జనరేషన్ అమ్మాయిలందరి చుట్టూ తిరుగుతుందని వాసుకి తెలిపింది.
ప్రజావాణి చీదిరాల