Entertainment

Megastar Chiranjeevi: వారసుడొచ్చాడు.. మెగాస్టార్ కోరిక తీరినట్టేనా?

మెగా ఇంటికి వారసుడొచ్చాడు. మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంతో మునిగి పోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వీరికి పండంటి మగబిడ్డ పుట్టాడు.

Megastar Chiranjeevi: వారసుడొచ్చాడు.. మెగాస్టార్ కోరిక తీరినట్టేనా?

మెగా ఇంటికి వారసుడొచ్చాడు. మెగా ఫ్యామిలీ (Mega Family) మొత్తం ఆనందంతో మునిగి పోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), లావణ్య (Lavanya Tripati) దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వీరికి పండంటి మగబిడ్డ పుట్టాడు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మనవడి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆయన ఆనందానికి అయితే అవధుల్లేవనే చెప్పాలి. విషయం తెలిసిన వెంటనే షూటింగ్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు చిరు వచ్చేశారు. వరుణ్ తేజ్ (Varun Tej) దంపతులకు నెట్టింట పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నాగబాబు (Nagababu), ఆయన సతీమణి పద్మజ, నిహారిక (Niharika Konidela) అంతా హాస్పిటల్‌కు వచ్చారు. వాస్తవానికి ఈ బాబు చాలా స్పెషల్. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా మూడో తరంలో అబ్బాయిలు ఇప్పటి వరకూ లేరు.

రామ్ చరణ్‌ (Ram Charan)తో పాటు ఆయన ఇద్దరు సోదరీమణులకు ఆడపిల్లలే జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం మగ పిల్లాడి కోసం కొంతకాలంగా తపిస్తున్నారు. గతంలో ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Ananadam Movie) ప్రి రిలీజ్ వేడుకకు హాజరైన చిరు చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. మనవరాళ్లతో తన ఇల్లు లేడీస్ హాస్టల్‌ (Ladies Hostel)లా.. తనొక వార్డెన్‌లా మారిపోయానన్నారు. అలాగే రామ్ చరణ్‌కు మళ్లీ కూతురు పుడుతుందేమోనని భయంగా ఉందని.. కొడుకు పుట్టాలని తనకు కోరికగా ఉందన్నారు. వారసత్వం కోసం మగ పలిల్లాడిని కనాలంటూ రామ్ చరణ్‌కు సలహా ఇచ్చినట్టు చెప్పి అప్పట్లో చిరు హాట్ టాపిక్‌గా మారారు. మూడో తరంలో అంతా ఆడపిల్లలే పుట్టడంతో ఆయనకు అలా అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు చిరు మనసు ఆనందంతో నిండిపోయి ఉంటుందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. చిరు బాబుని ఎత్తుకున్న ఫోటోతో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 10, 2025 2:01 PM