Biggboss 9: నాన్న అవుట్.. తనూజ టార్గెట్
నామినేషన్స్ పర్వం ముగిశాక తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్ (Tanuja Vs Emmanuel) పెద్ద గొడవ జరిగింది. అది చూస్తుంటే ఇద్దరి వైపు నుంచి తప్పులు అయితే ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి.

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) రసవత్తరంగా మారింది. ముఖ్యంగా గత వారం భరణి ఎలిమనేట్ (Bharani Elimination) అయి వెళ్లిపోయాక ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. అంతకు ముందే.. అంటే భరణి బిగ్‌బాస్ హౌస్ (Biggboss House) నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోవకడానికి పూర్వమే ఇమ్మాన్యుయేల్ (Emmanuel)లో కొంత మార్పు వచ్చింది. అకారణంగా భరణికి వ్యతిరేకమయ్యాడు. తన అక్కసంతా ఎలిమినేషన్స్‌లో చూపించి భరణి బయటకు వెళ్లేందుకు ముఖ్య కారణమయ్యాడు. అయితే భరణితో పాటే తనూజ (Tanuja) నుంచి కూడా ఇమ్మాన్యుయేల్ దూరమవడం ప్రారంభించాడు. అంతకుముందు నుంచే చిన్న చిన్నగా ఆ ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి.
ఇక తాజాగా ఆదివారం ఎపిసోడ్‌లో భాగంగా తనూజకు వచ్చిన వారంతా ఇచ్చిన ఎలివేషన్స్.. ఆది అయితే దాదాపుగా విన్నర్ మెటీరియల్ (Tanuja Winner Material) అని చెప్పేయడం వంటి వాటి కారణంగా తనూజ అందరికీ టార్గెట్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇమ్మూకి కూడా. ఆసక్తికర విషయం ఏంటంటే.. తనూజను పవన్ కల్యాణ్ (Pan Kalyan) నామినేట్ చేయాలనుకోవడం.. ఆ విషయాన్ని ఇమ్మూకి చెప్పి అతని నుంచి చిట్టీ తీసుకున్నాడు. కానీ తనూజను నామినేట్ చేయలేదు. అప్పుడు కల్యాణ్‌ను తనూజను నామినేట్ చేస్తానని ఎందుకు చేయలేదంటూ ఇమ్మూ నిలదీశాడు. అప్పుడు కానీ అసలు విషయం బయటకు రాలేదు. అది చూసిన తనూజకు మైండ్ బ్లాక్ అయినంత పనైంది. మొత్తానికి భరణి వెళ్లిపోయాక ఒకవైపు కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రమ్య అందరూ తనూజను టార్గెట్ చేశారనడంలో సందేహమే లేదు.
నామినేషన్స్ పర్వం ముగిశాక తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్ (Tanuja Vs Emmanuel) పెద్ద గొడవ జరిగింది. అది చూస్తుంటే ఇద్దరి వైపు నుంచి తప్పులు అయితే ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి. దానికి కారణం ముఖ్యంగా తప్పుగా అర్థం చేసుకోవడమేనని తెలుస్తోంది. మరోకారణం తనూజ టాప్‌లో ఉందన్న విషయం ఇమ్మాన్యుయేల్‌కి పక్కాగా అర్థమై ఉండాలి. ఈ క్రమంలోనే ఆమెతో శత్రుత్వం పెట్టుకుంటూ కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా ఇమ్మాన్యుయేల్ మాత్రం సేఫ్ గేమ్ ఆడుతూ తనను తాను దిగజార్చుకుంటున్నాడనడంలో సందేహమే లేదు. అది మాత్రమే కాకుండా ఆరు వారాలుగా నామినేషన్స్‌లోకే రావడం లేదు. ఇన్ని వారాల పాటు నామినేషన్స్‌లోకి రాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో నిలబడటం కష్టమే. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
ప్రజావాణి చీదిరాల