TFJA: వైజేఆర్ అధ్యక్షతన కొలువుదీరిన టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం
తెలుగు సినీ జర్నలిస్టుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న టీఎఫ్‌జేఏలో ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్, డిజిటల్ మీడియా సంస్థలతో పాటు పీఆర్ఓలుగా పని చేస్తున్న వారిని సభ్యులుగా తీసుకున్నారు.
‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ (TFJA) నూతన కార్యవర్గం కొలువుదీరింది. తెలుగు సినీ జర్నలిస్టుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న టీఎఫ్‌జేఏలో ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్, డిజిటల్ మీడియా సంస్థలతో పాటు పీఆర్ఓలుగా పని చేస్తున్న వారిని సభ్యులుగా తీసుకున్నారు. టీఎఫ్‌జేఏ నూతన అధ్యక్షుడిగా వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదం రఘు నియమితులయ్యారు. కోశాధికారిగా నాయుడు సురేందర్ కుమార్ నియమితులయ్యారు. టీఎఫ్‌జేఏ ఉపాధ్యక్షులుగా.. జె.అమర్ వంశీ, వి. ప్రేమ మాలిని, సంయుక్త కార్యదర్శులుగా జీవి, సురేష్ కొండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
టీఎఫ్‌జేఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వై. రవిచంద్ర, ఎం. చంద్రశేఖర్, ఫణి కందుకూరి, డా చల్లా భాగ్యలక్ష్మి, బి. వేణు, శివ మల్లాల, రాంబాబు పర్వతనేని, దీపక్ కోడెల, కె. సతీష్, శ్రీను దుడ్డి, సత్య పులగం నియమితులయ్యారు. టీఎఫ్‌జేఏ తరుఫున సభ్యులకు ప్రతి ఏటా హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో పాటు యాక్సిడెంటల్ పాలసీ వంటివి అందిస్తున్నారు. అలాగే హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ వస్తున్నారు. అసోసియేషన్ సభ్యులతో ఆగిపోకుండా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు కూడా పెద్ద పీట వేస్తున్నారు. మరోవైపు హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ వంటివి సైతం ఏర్పాటుకు కృషి చేస్తామని టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం వివరించింది. ఇప్పటికే నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు సభ్యుల ఉన్నతికి సైతం కృషి చేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక సభ్యులు ఎవరైనా తమ విలువైన సలహాలు, సూచలను అందించేందుకు మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నంబర్లను సైతం వెలువరించింది.
సలహాలు, సూచనలకు సంప్రదించాల్సిన మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు..
Mail ID: tfja18@gmail.com
Phone Number: +91 72778 45678
ప్రజావాణి చీదిరాల