Entertainment

Anchor Suma: సుమగారూ ఇది విన్నారా? రాజీవ్ చంపేస్తారట..

‘నన్ను చంపేస్తే.. నిన్ను చంపేస్తా’ అంటూ రాజీవ్ కనకాల వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఆయన సతీమణి సుమకు కంప్లైంట్ చేస్తున్నారు.

Anchor Suma: సుమగారూ ఇది విన్నారా? రాజీవ్ చంపేస్తారట..

‘నన్ను చంపేస్తే.. నిన్ను చంపేస్తా’ అంటూ రాజీవ్ కనకాల వార్నింగ్ (Rajiv Kanakala Warning) ఇచ్చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఆయన సతీమణి సుమ (Anchor Suma)కు కంప్లైంట్ చేస్తున్నారు. ‘సుమ గారూ.. ఇది విన్నారా? రాజీవ్ చంపేస్తారట’ అంటూ సరదాగా నెట్టింట ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. కెరీర్ పరంగా రాజీవ్ గత కొంత కాలంగా ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. వరుస చిత్రాలు, వెబ్ సిరీస్‌ (Web Series)లు, షార్ట్ ఫిలిమ్స్ (Short Films) ఏవీ వదలకుండా చేసేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే సుమ కంటే కూడా రాజీవ్ యమా బిజీ. అయితే తాజాగా ఆయన నటిస్తున్న ‘లవ్ ఓటిపి (Love OTP)’ చిత్రం నుంచి ఒక ప్రమోషనల్ వీడియో బయటకు వచ్చింది.

ఈ చిత్ర మేకర్స్ ఈ ప్రమోషనల్ వీడియోను వదిలారు. దానిలో రాజీవ్ తాను వరుస చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ నటుడిగా చాలా ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. అప్పుడే సీన్‌లోకి వచ్చిన ‘లవ్ ఓటిపి’ దర్శకుడు, హీరో అనీష్ (Hero Anish) కొత్త కథతో తన దగ్గరకు వచ్చాడని వెల్లడించారు. ఆ చిత్రంలో తనకు తానే చాలా కొత్తగా కనిపించానని.. సినిమాలో తనను చంపేస్తే మాత్రం తాను చంపేస్తానంటూ రాజీవ్ సదరు వీడియోలో తెలిపారు. మొత్తానికి ఈ ప్రమోషనల్ వీడియో అయినా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆమధ్య కాలంలో రాజీవ్‌ను కొన్ని చిత్రాల్లో చంపేశారు. ఈ క్రమంలోనే ఆయన ముందుగానే వార్నింగ్ ఇచ్చారు. అది కాస్తా వైరల్ అవుతోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 13, 2025 4:11 PM