Entertainment

Sreeleela: శ్రీకాకుళం యాసలో దుమ్ము రేపుతుందట..

రవితేజతో కలిసి పని చేయడం చాలా సులభంగా ఉంటుందని శ్రీలీల తెలిపింది. తాను ఈ చిత్రంలో శ్రీకాకుళం యాసతో దుమ్మురేపుతానని వెల్లడించింది. తానొక సైన్స్ టీచర్‌గా నటించినట్టు తెలిపింది.

Sreeleela: శ్రీకాకుళం యాసలో దుమ్ము రేపుతుందట..

‘మాస్ జాతర’ (Mass Jathara)కు వేళవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రచార జోరును పెంచేశారు. రవితేజ (Raviteja), శ్రీలీల (Srileela) జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. భాను భోగవరపు (Director Bhanu Bhogavarapu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం హాస్యం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందింది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన అప్‌డేట్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ, శ్రీలీల తదితరులు సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ చిత్రంలో రవితేజ ఆర్‌పీఎఫ్ (Railway Protection Force) అధికారిగా నటించారు. తన సినీ ప్రయాణంలో ఇదొక సరికొత్త, ప్రత్యేకమైన పాత్ర అని రవితేజ తెలిపారు. భాను చాలా మంచి దర్శకుడని ప్రతి సన్నివేశాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాడని.. అంతేకాకుండా ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినా కూడా వేగంగా చేస్తారని పేర్కొన్నారు. భీమ్స్ (Bheems) సంగీతం ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించిందని రవితేజ తెలిపారు. మాస్ జాతర సినిమా వినోదం, మాస్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలతో నిండి ఉంటుందని తెలిపారు. రవితేజతో కలిసి పని చేయడం చాలా సులభంగా ఉంటుందని శ్రీలీల తెలిపింది. తాను ఈ చిత్రంలో శ్రీకాకుళం యాసతో దుమ్మురేపుతానని వెల్లడించింది. తానొక సైన్స్ టీచర్‌గా నటించినట్టు తెలిపింది.

చక్కటి పల్లెటూరి అమ్మాయిగా.. తాను కనిపిస్తానని శ్రీలీల వెల్లడించింది. ఈ చిత్రంలో తన పాత్ర గతంలో తను నటించిన అన్ని పాత్రలకూ చాలా భిన్నంగా ఉంటుందని తెలిపింది. స్క్రిప్ట్ చదివినప్పుడే తాను చాలా నవ్వుకున్నానని, ఇక షూటింగ్ సమయంలో దానికి రెట్టింపు నవ్వుకున్నట్టు వెల్లడించింది. రవితేజ గాయంతో బాధపడుతూ కూడా ‘తూ మేరా లవర్’ పాటను పూర్తి చేసిన మీదట ఆసుపత్రికి వెళ్లాడని తెలిపింది. తొలిరోజు షూటింగ్‌ను పూర్తి చేసి రవితేజ తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా సహకరించాడని దర్శకుడు భాను తెలిపారు. రవితేజే టైటిల్ ఆలోచన చేయగా.. దానికి ‘మనదే ఇదంతా’ ట్యాగ్‌లైన్ జత చేసినట్టు వెల్లడించారు. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) సైతం ఒక పాత్రల కనిపిస్తారన్నారు. ఇక ‘ఓలే ఓలే’ పాట సాహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పాటలోని సెకండ్ పార్ట్ చాలా పాజిటివ్ వైబ్‌తో ఉంటుందని భాను తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 7, 2025 3:00 PM