Entertainment

Sitha Payanam: ప్రేమికుల రోజు సందర్భంగా ‘సీతా పయనం’ ప్రారంభం..

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రముఖ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతోంది.

Sitha Payanam: ప్రేమికుల రోజు సందర్భంగా ‘సీతా పయనం’ ప్రారంభం..

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రముఖ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతోంది. ముఖ్య పాత్రల్లో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ నటించగా.. అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో మెప్పించనున్నారు. అర్జున్ మేనల్లుడు, ప్రిన్స్ ధ్రువ సర్జా సైతం ఒక ప్రత్యేక కామియో రోల్‌లో కనిపించనున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని సైతం పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినూత్న ప్రమోషనల్ కార్యక్రమాలతో ‘సీతా పయనం’ చిత్ర యూనిట్ ఆకట్టుకుంటోంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 6, 2026 1:54 PM