వామ్మో.. ‘బిగ్‌బాస్’ పిచ్చి మామూలుగా లేదుగా.. అన్నివేల మందా?
ఎంతమంది ట్రై చేశారో తెలిస్తే షాకవుతారు. మీ ఊహకు కూడా అందదు. వాస్తవానికి గత సీజన్లలో సామాన్యుల కేటగిరీ ఎంపిక ప్రక్రియ చాలా మందికి తెలియదు కాబట్టి ప్రయత్నించినట్టు లేరు.

ప్రస్తుతం యూట్యూబ్ ఛానళ్లలో ఎక్కడ విన్నా ’బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 9 గురించే.. ఏముంది అంతలా ఆ బిగ్‌బాస్‌లో.. ఏమో మాకవన్నీ తెలియవు.. కానీ చర్చించుకోవాల్సిందే అంటారా? బిగ్‌బాస్‌కు వెళ్లాలని తపించేవారు కొందరైతే.. చూసి ఆనందించేవారు ఇంకొందరు.. మరో కేటగిరీ కూడా ఉందండోయ్.. విమర్శించేవారు.. అది చాలదనుకుంటే కోర్టులో కేసులు వేసేవారు.. ఏరకంగా అయితేనేం బిగ్‌బాస్‌ను చూస్తూనే ఉంటారు కదా. అందుకే ఆ రియాలిటీ షోకి అంత పాపులారిటీ.. అంత రేటింగ్..
‘బిగ్‌బాస్’ తెలుగు (Biggboss telugu) 9వ సీజన్ (Biggboss Telugu 9th season) ప్రారంభానికి వేళవుతోంది. ఎంతో మంది యూత్.. వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు సామాన్యుల కేటగిరీ కోసం ట్రై చేశారు. ఎంతమంది ట్రై చేశారో తెలిస్తే షాకవుతారు. మీ ఊహకు కూడా అందదు. వాస్తవానికి గత సీజన్లలో సామాన్యుల కేటగిరీ ఎంపిక ప్రక్రియ చాలా మందికి తెలియదు కాబట్టి ప్రయత్నించినట్టు లేరు. ఈసారి మాత్రం వేలల్లో ట్రై చేశారు. ఇంతకీ ఎంతమంది ట్రై చేశారంటారా? దాదాపు 20 వేల మంది. నిజంగానే షాకింగ్ కదా.. ఇక ప్రస్తుతం సామాన్యుల కేటగిరీ ఎంపిక శరవేగంగా జరుగుతోంది. అగ్ని పరీక్ష అనే కార్యక్రమం ద్వారా సామాన్యుల కేటగిరి (Common Man Category) నుంచి కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ అగ్నిపరీక్షకు అభిజీత్ (Abhijith), బిందు మాధవి (Bindu Madhavi), నవదీప్ (Navadeep) జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
వడబోత కార్యక్రమం ఎలా జరిగిందంటే..
మరి ఈ ఎంపిక ప్రక్రియ పూర్తైందా? దీనిలో ఎంతమందిని ఎంపిక చేశారు? వారు ఎవరు? వారే ఫైనలా? లేదంటే మరో టెస్ట్ ఏమైనా ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 20 వేల మంది మూడు నిమిషాల నిడివి కలిగిన వీడియోను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బిగ్‌బాస్ నిర్వాహకులకు పంపించారు. ఇక వీరి వడబోత కార్యక్రమం ఎలా జరిగిందో కూడా తెలుసుకుందాం. వారి నుంచి 200 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వారి నుంచి 100 మందిని తర్వాతి లెవల్‌లో షార్ట్ లిస్ట్ చేశారు. ఆ 100 మందికి గ్రూప్ డిస్కషన్ పెట్టారు. వారిలో అద్భుతంగా మాట్లాడగలిగిన 44 మందిని ఫైనల్ చేసి వారితో అగ్నిపరీక్ష (Agni Pariksha) షో ప్రారంభించారు. ఈ షోలో టాస్క్‌లు పెట్టి వాటిలో గెలిచిన వారిని నెక్ట్స్ లెవల్‌కి పంపించారు. ఈ షోలో 2-3 సార్లు తమను తాము నిరూపించుకోలేకపోయిన వారిని ఎలిమినేట్ చేసి 15 మందిని సెలక్ట్ చేశారు. వారి నుంచి చివరకు ఐదుగురిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించనున్నారు.
బిగ్‌బాస్ ప్రయత్నానికి గండి కొడతారా?
మరి ఆ ఐదుగురు అదృష్టవంతులెవరో తెలియాల్సి ఉంది. ముందుగా సెమీ ఫైనల్‌లో ఎంపికైన ఆ 5 మంది ఎవరనేది తెలుసుకుందాం. 1. శ్వేతా శెట్టి 2. దివ్యానిఖిత 3. శ్రేయ 4. ఇన్‌స్టాగ్రాం ఇన్‌ఫ్లూయన్సర్ అనూషా రత్నం 5.షాకీబ్ 6. ప్రసన్న కుమార్ 7. దమ్ము శ్రీజ 8. కల్కి 9. లాయర్ ప్రశాంత్ 10. మర్యాద మనీష్ 11. మాస్క్ మెన్ ఉదయ్ 12. ఆర్మీ జవాన్ పవన్ కల్యాణ్ 13.దాలియా 14. ప్రియా శెట్టి 15.డెమన్ పవన్. మొత్తానికి మరికొన్ని గంటల్లో ఫైనల్‌కు చేరుకున్న ఐదుగురు ఎవరో కూడా తెలిసిపోతుంది. ఈసారి బిగ్‌బాస్ నిర్వాహకులు వెరైటీగా అయితే ఏదో ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి అది ఎంతవరకూ సక్సెస్ అవుతుంది? కంటెస్టెంట్స్ షోకి హైప్ తీసుకొస్తారా? లేదంటే బిగ్‌బాస్ ప్రయత్నానికి గండి కొడతారా? అనేది షో ప్రారంభమైతే కానీ తెలియదు.
ప్రజావాణి చీదిరాల