Chiranjeevi: ‘శంకరవరప్రసాద్’గారు.. ఈసారి పొంగల్ వెరీ హాటండోయ్..
‘శంకరవరప్రసాద్’గారు ఈసారి సినిమా అంత వీజీ కాదండోయ్.. ‘అనగనగా ఒకరాజు’ అంటూ ఒకరు.. ‘రాజాసాబ్’ అంటూ మరొకరు ఎగేసుకుని వచ్చేస్తున్నారు.

‘శంకరవరప్రసాద్’గారు ఈసారి సినిమా అంత వీజీ కాదండోయ్.. ‘అనగనగా ఒకరాజు’ అంటూ ఒకరు.. ‘రాజాసాబ్’ అంటూ మరొకరు ఎగేసుకుని వచ్చేస్తున్నారు. బరిలో మాంచి పందెం కోళ్లు తలపడితే ఎలా ఉంటుందో ఈసారి పొంగల్ అలా ఉంటుంది. ప్రతి ఏటా స్వీటును పంచే పొంగల్ ఈసారి హాట్ హాట్‌గా ఉండబోతోంది. ఎందుకంటే విడుదల కానున్న మూడు చిత్రాలు మంచి కామెడీ ఎంటర్‌టైనర్సే. ఎవరెక్కువ నవ్విస్తే వారికే ప్రేక్షకుడి ఓటు.
ప్రస్తుతం కామెడీకి కేరాఫ్ అంటే అనిల్ రావిపూడి. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam)’తో భారీ సక్సెస్ కొట్టారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి (Sankranthi)కి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో బరిలోకి దిగబోతున్నారు. ‘మన శంకరవరప్రసాద్’ (Mana Shankaravara Prasad) టైటిల్‌లో చిరు (Chiru), అనిల్ కాంబో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసారి మరో రెండు సినిమాలు కూడా బరిలోకి దిగనున్నాయి. ఒక నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ (Rajasaab), మరొకటి నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటించిన ‘అనగనగా ఒక రాజు‘ (Anaganaga Oka Raju). ప్రభాస్ (Prabhas) అంటే ఓకే కానీ నవీన్ పొలిశెట్టి.. చిరుకి పోటీయా అంటారేమో.. పక్కాగా పోటీయే. ఎందుకంటే నవీన్ పొలిశెట్టి చిత్రాలు కామెడీకి కేరాఫ్.. చిరు కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌తోనే రాబోతున్నారు. ఆసక్తికరంగా ప్రభాస్ కూడా కామెడీ అండ్ హారర్ ఎంటర్‌టైనర్ (Comedy and Horror Entertainer)తో బరిలోకి దిగుతున్నాడు.
కామెడీ పండించంలో చిరు కూడా దిట్టే. గతంలో పలు చిత్రాల ద్వారా ఆయన దీన్ని నిరూపించారు. అలాగే అనిల్ రావిపూడి (Anil Ravipudi) కామెడీ చిత్రాలకు కేరాఫ్. ఒక్క ప్రభాసే కాస్త డౌటు. కానీ కామెడీ అండ్ హారర్ మిక్స్ చేసి కొడుతున్నాడు కాబట్టి సందేహించాల్సిన పని లేదు. ముగ్గురూ ముగ్గురే కాబట్టి ఎవరు ఎక్కువ నవ్విస్తే వారే పొంగల్ కింగ్. ఈ ఏడాది పొంగల్ అయితే అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకున్నారు కానీ వచ్చే ఏడాది పొంగల్‌ను వేసుకోవడం అంత సులువేం కాదు. హెవీ కాంపిటీషన్ నడుమ నెట్టుకురావడం కాస్తంత కష్టమే. మూడు సినిమాలు కామెడీ జానరే.. అలాగే ముగ్గురూ మంచి పేరున్న హీరోలే కావడంతో మార్కెట్ స్ప్లిట్ అవుతుంది. ఫస్ట్ టాక్ ఏ చిత్రానికి బాగా వస్తే.. ఆ చిత్రానిదే పైచేయి అవుతుంది. రివ్యూల పరంగా కాదండోయ్.. జనాలు రివ్యూలను నమ్మడం మానేశారు. కేవలం మౌత్ టాకే ప్రస్తుతం సినిమాను నిలబెట్టినా.. ముంచినా..
ప్రజావాణి చీదిరాల