Sasivadane: ప్రేమ కోసం పెద్ద యుద్ధమే చేసినట్టున్నాడు..
‘ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది.. ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అంటూ కోమలి చూసిన క్షణం రక్షిత్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

రక్షిత్ అట్లూరి (Rakshith Atluri), కోమలి (Komali) జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’ (Sasivadane). ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందకు రానుంది. సాయి మోహన్ (Director Sai Mohan) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ (Ahiteja Bellamkonda), అభిలాష్ రెడ్డి (Abhilash Reddy)లు నిర్మించారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ (Sasivadane Trailer) విడుదలైంది. తండ్రీ కొడుకుల అనుబంధంతో పాటు మంచి లవ్ స్టోరీని ఈ సినిమాలో చూపించినట్టుగా ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో అయితే పెద్ద యుద్ధమే చేసినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
‘ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది.. ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అంటూ కోమలి చూసిన క్షణం రక్షిత్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తన ప్రేయసి కోసం రక్షిత్ గోదావరి (Godavari)ని దాటడం.. అలాగే గోదావరి అందాలను అద్భుతంగా చూపించారు. అలాగే గోదావరి యాస కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ అని చెప్పాలి. ‘ఒక్కసారి ప్రేమించాలని డిసైడ్ అయ్యామంటే.. ఎన్నొచ్చినా యుద్ధం చేయాల్సిందే’నంటూ హీరో చెప్పే కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా చక్కటి పల్లెటూరి వాతావరణం అందంగా ముస్తాబైనట్టుగా తెలుస్తోంది. కొడుకుని చక్కగా గైడ్ చేసే తండ్రి.. అన్నీ సినిమాకు బాగా కుదిరాయి. మొత్తానికి ఒక మంచి ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపొందింది.
ప్రజావాణి చీదిరాల