Santhana Prapthirasthu: బిజీ లైఫ్‌లో యంగ్ కపుల్ ఎదుర్కొంటున్న పెను సమస్యే చిత్రంగా..
ఈ రోజు సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్యతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా సందేశాత్మకంగా ఉండదన్నారు. లైటర్ వేలో ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌డ్‌గా ఉంటుంది.
విక్రాంత్ (Vikranth), సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) కాంబోలో రూపొందిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి (Madhura Sridhar Reddy), నిర్వి హరిప్రసాద్ రెడ్డి (Nirvi Hariprasad Reddy) నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై.. సినిమా నుంచి ‘తెలుసా నీ కోసమే’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అజయ్ అరసాడ ఈ పాటను బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేయగా.. అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునేలా పాడారు.
ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు (Producer Suresh Babu) మాట్లాడుతూ.. మధుర శ్రీధర్ తనకు మంచి మిత్రులన్నారు. స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన శ్రీధర్.. ఆ జాబ్ వదిలి ప్రొడ్యూసర్‌గా మారారన్నారు. సినిమా అంటే ఎంతో ప్యాషన్‌తో ఉంటారని.. ఆయన ఎఫర్ట్స్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదన్నారు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Prapthirasthu) కథ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందన్నారు. ఈ కథలో నేడు సొసైటీ ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యను లైట్ హార్టెట్‌గా స్క్రిప్ట్ చేశారని విక్రాంత్ పేర్కొన్నారు. పిల్లలు పుట్టని యంగ్ కపుల్స్ సొసైటీ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారన్నారు. అలాంటి ఎమోషనల్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కిందని.. ఎక్కడా సినిమాలో అసభ్యత ఉండదని పేర్కొన్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందన్నారు.
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్యతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టుగా వెల్లడించారు. సినిమా సందేశాత్మకంగా ఉండదన్నారు. లైటర్ వేలో ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌డ్‌గా ఉంటుందన్నారు. ప్రొడ్యూసర్స్ శ్రీధర్, నిర్వి హరిప్రసాద్ మూవీకి కావాల్సిన సపోర్టు పూర్తిగా ఇచ్చారన్నారు. హీరో విక్రాంత్ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేశాడని.. అతనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో నటించాడన్నారు. ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో పెద్ద సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయనే పాయింట్ నుంచే కథ మొదలైందని తెలిపారు. పిల్లలు పుట్టకపోవడం అనేది బిజీ లైఫ్‌లో ఉన్నవారి జీవితాల్లో పెను సమస్యగా మారిందన్నారు. కొన్నేళ్లుగా మన సొసైటీలో ఈ సమస్యను చూస్తూనే ఉన్నామన్నారు. ఈ పాయింట్‌తోనే ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాను ఎలాంటి వల్గారిటీ లేకుండా తెరకెక్కించినట్టు తెలిపారు. మంచి ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో చిత్రాన్ని రూపొందించినట్టుగా పేర్కొన్నారు. ఈసారి డిజప్పాయింట్ చేయబోమని సురేష్ బాబుకి మాటిచ్చానని తెలిపారు.
ప్రజావాణి చీదిరాల