Entertainment

Samantha: న్యూ జర్నీ అంటూ సమంత పోస్ట్.. అదేంటో తెలిస్తే..

దసరా పండుగ సందర్భంగా సమంత (Samantha) ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘కొత్త ప్రయాణం’ (Samantha New Journey) అనే క్యాప్షన్ ఇచ్చి మరీ..

Samantha: న్యూ జర్నీ అంటూ సమంత పోస్ట్.. అదేంటో తెలిస్తే..

దసరా పండుగ సందర్భంగా సమంత (Samantha) ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘కొత్త ప్రయాణం’ (Samantha New Journey) అనే క్యాప్షన్ ఇచ్చి మరీ ఒక ఫోటోను షేర్ చేసింది. ఇంతకీ ఆ జర్నీ ఏంటంటే.. సమంత కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి ముందు ఫోటో తీసుకుని దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత ఇంటి ముందు SAM (సామ్) అని తన నిక్ నేమ్‌ను ఇంగ్లీష్ అక్షరాల్లో రాసి ఉంది. దీనికి మించి సమంత అయితే ఏ వివరాలనూ వెల్లడించలేదు.

కనీసం ఇంటిని ఎక్కడ కొనుగోలు చేసిందనే క్లారిటీ కూడా ఏమీ లేదు. దీంతో రాసుకున్నోడికి రాసుకున్నంత అన్నట్టుగా అయ్యింది. అసలు సామ్ ముంబైలో ఇల్లు తీసుకుందా? లేదంటే హైదరాబాద్‌లోనా? అన్న క్లారిటీ కూడా ఏమీ లేదు. దీనిపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

వాస్తవానికి సమంత అయితే కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉండటం లేదు. తనకు మయోసైటిస్ (Myositis) వ్యాధి సోకినప్పటి నుంచి ముంబైలోనే నివాసముంటోంది. నటనకు సైతం విరామం ఇచ్చింది. కేవలం వెబ్ సిరీస్‌ల్లో మాత్రమే నటించింది.

ఇక ‘శుభం’ (Shubham Movie) అనే సినిమా తీసి నిర్మాతగానూ మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలోనే కేమియో రోల్ (Samantha in Cameo) ఒకటి చేసింది. ప్రస్తుతం సమంత ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ (Rakt Brahmand: The Bloody Kingdom) అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. సమంత ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ (Samantha Maa Bangaram Movie) సినిమా చేసినా కూడా దాని షూటింగ్ ఎందుకో ప్రారంభమే కాలేదు. ఈ సినిమాకు నందినీ రెడ్డి (Director Nandini Reddy) దర్శకత్వం వహించనున్నారని టాక్.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 3, 2025 3:02 AM