Entertainment

Ram Charan: అభిమానం వెర్రితలలు వేయడమంటే ఇదే..

అభిమానం వెర్రితలలు వేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇదే జరుగుతూ ఉంటుంది. గతమెప్పుడూ గుణపాఠం కావాలి. కానీ అది జరగడం లేదు. కొద్ది రోజుల క్రితం విజయ్‌ని విమానాశ్రయం నుంచి తన కారు వైపునకు వెళుతుంటే అభిమానులు అడ్డగించారు.

Ram Charan: అభిమానం వెర్రితలలు వేయడమంటే ఇదే..

అభిమానం వెర్రితలలు వేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇదే జరుగుతూ ఉంటుంది. గతమెప్పుడూ గుణపాఠం కావాలి. కానీ అది జరగడం లేదు. కొద్ది రోజుల క్రితం విజయ్‌ని విమానాశ్రయం నుంచి తన కారు వైపునకు వెళుతుంటే అభిమానులు అడ్డగించారు. ఒక్కసారిగా సెల్ఫీల కోసం మీద పడిపోయారు. దీంతో విజయ్ కిందపడిపోయారు. ఇదొక్కటేనా? గతంలో సమంతను సైతం ఇలాగే వేధించారు. ఇక తాజాగా రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. రామ్ చరణ్‌కు కవలలు జన్మించారు. ఈ క్రమంలోనే ఆయన తన తొలి బిడ్డ చిన్నారి క్లీంకారతో కలిసి అపోలో ఆసుపత్రికి వచ్చారు. అప్పటికే వందల సంఖ్యలో అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు.

రామ్ చరణ్‌ను చూడటానే అభిమానం హద్దులు దాటింది. కనీసం ఆయన చేతిలో చిన్నారి క్లీంకార ఉందనే విషయాన్ని సైతం విస్మరించారు. చర‌ణ్ కారు దిగ‌గానే వంద‌లాది మంది ఫ్యాన్స్ ఒక్క‌సారిగా ఆయనను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. అభిమానుల అరుపులు, కేకలతో చిన్నారి క్లీంకార భయపడిపోయి ఏడుపు లంకించుకుంది. తన కుమార్తెను కాపాడుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లడం రామ్ చరణ్‌కు పెద్ద సవాల్‌గా మారింది. అభిమానులు చేసిన పనికి తీవ్ర అసహనానికి రామ్ చరణ్ గురయ్యారు. అభిమానం ఉండొచ్చు కానీ అది శృతి మించకూడదు. సమయం, సందర్భం చూసుకోవాలి. లేదంటే ఎదుటివారికి అదే ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. మెగా అభిమానులు ఇలా చేయడం దారుణం.

ఒకవైపు చిన్నారి క్లీంకార రామ్ చరణ్ చేతిలో ఉంది. మరోవైపు ఆసుపత్రిలో రోగులు ఉన్నారు. అభిమానుల అరుపులు, కేకల కారణంగా వారికేమైనా అయితే పరిస్థితి ఏమిటి? కనీసం ఇంగితం లేకుండా ప్రవర్తించడం దారుణం. ఒక్క రామ్ చరణ్ మాత్రమే కాదు. ఎంతోమంది సెలబ్రిటీలు ఏదో ఒక సందర్భంలో ఇలా అభిమానుల కారణంగా ఇబ్బంది పడినవారే. ఎన్టీఆర్‌కు ఆయన తండ్రి మరణించిన సమయంలో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. కనీసం తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లనివ్వకుండా అడ్డుపడ్డారు. ఇదంతా కూడా అభిమానులు కేవలం సెల్ఫీల కోసం చేయడం ఇబ్బందికర పరిణామం. పోలీసులు సైతం పరిసన్థితిని అదుపు చేయలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 2, 2026 4:49 AM