Rajeev Kanakala: పెళ్లికి ముందు సుమ వాళ్లింటికెళితే.. ఆమె తండ్రి వీపుపై గట్టిగా ఒక్కటేశారు..
సుమతో తాను కూడా దుప్పటి కప్పుకుని ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడినని చెప్పారు. అప్పట్లో ల్యాండ్ లైన్ మాత్రమే ఉండేదని.. తన రూమ్మేట్ వచ్చేసి జబర్దస్త్ రాఘవ అని తెలిపారు.

‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) సినిమా సక్సెస్ జోష్‌ని నటీనటులంతా ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల (Rajeev Kanakala) సైతం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలో మాదిరిగానే సుమ (Anchor Suma)తో తాను కూడా దుప్పటి కప్పుకుని ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడినని చెప్పారు. అప్పట్లో ల్యాండ్ లైన్ మాత్రమే ఉండేదని.. తన రూమ్మేట్ వచ్చేసి జబర్దస్త్ రాఘవ (Jabardast Raghava) అని తెలిపాడు. ఫోన్ సరిగా వినిపించపోతే ఫ్యాన్ ఆఫ్ చేసేవాడినని.. అప్పుడు రాఘవ.. ‘నీ ప్రేమ కోసం నన్ను దోమలతో కరిపిస్తావేంటిరా?’ అని మొత్తుకునేవాడని తెలిపారు. ఇక సినిమాలో ఎస్ఎస్ కాంజీ మాదిరిగానే సుమ (Suma) ఫాదర్ కూడా ఉండేవారని.. దీనికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని రాజీవ్ పంచుకున్నారు.
సుమ తండ్రి చాలా పద్ధతిగా.. స్ట్రిక్ట్‌గా ఉండేవారట. ఓనం పండుగ వచ్చిందట. అప్పటికీ వీరిద్దరి లవ్ గురించి సుమ ఇంట్లో తెలియదని రాజీవ్ చెప్పుకొచ్చారు. ‘‘బ్నిం, నన్ను, రాఘవ తదితరులను భోజనానికి పిలిచారు. మెట్టుగూడలో వాళ్లిల్లు. తప్పనిసరిగా కింద కూర్చొని తినాలి. చిన్న ఇల్లు. సోఫాను జరపడానికి పిలిస్తే రాఘవ వెళ్లాడు. చాలా బరువుగా ఉంది. నానా తిప్పలు పడి మొత్తానికి సోఫాను జరిపి పక్కనబెట్టారు. ఏం యంగ్ మ్యాన్ సోఫాను జరపలేవా? అని వీపు మీద ఒక్కటేశారు. వాడికి మంటెత్తిపోయి ఏదో అనబోతుంటే కాబోయే మామగారురా అని ఆపేశా’’ అని రాజీవ్ (Rajeev) చెప్పుకొచ్చారు. మా అత్తగారినైతే బాగా విసిగించేవాడినంటూరాజీవ్ తెలిపారు. ఫోన్ చేస్తే సుమ ఎత్తితే ఓకే.. వాళ్లమ్మగారు ఎత్తితే హలో.. హలో అని సైలెంట్ అయిపోయేవాడట. ఆమెకు మంటెత్తిపోయి మలయాళం (Malayalam)లో ఉన్న తిట్లన్నీ తిట్టేదంటూ రాజీవ్ తెలిపారు.
ప్రజావాణి చీదిరాల