Rajasaab Trailer: పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమైనా చీమనా? రాక్షసుడిని..
మొత్తానికి ఒక హారర్ ఎలిమెంట్‌ని కామెడీతో మిక్స్ చేసి చెప్పడం ఆసక్తికరం. గతంలో ఇలా వచ్చిన కొన్ని చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో..

ప్రభాస్ (Prabhas), మారుతి (Maruthi) కాంబోలో ‘రాజాసాబ్’ (Rajasaab) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ (Rajasaab Trailer) తాజాగా విడుదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ కామెడీ అండ్ హారర్ ఎంటర్‌టైనర్ (Comedy and Horror Entertainer) కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కామెడీ అంటే చూసేశారు కానీ హారర్ అనేది ఇంతవరకూ చూసిందే లేదు. మొత్తానికి ట్రైలర్ అయితే ఎలా ఉంటుందనే క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఫన్, ఫియర్ మిక్స్ చేసి వింటేజ్ లుక్‌లో ప్రభాస్ అయితే అదిరిపోయాడు. ట్రైలర్ విషయానికి వస్తే ఒక హిప్నాటిస్ట్ ప్రభాస్‌ను తనతో ఒక భారీ హవేలీలోకి తీసుకెళతాడు. అక్కడి నుంచి ట్రైలర్ ప్రారంభమవుతుంది.
‘చంపేశాడు బాబోయ్’ అంటూ తనదైన డిక్షన్‌తో ప్రభాస్ కామెడీ (Prabhas Comedy) వేరే లెవల్ అనే చెప్పాలి. హవేలీలో అనుకోని సంఘటనలు.. దానికి కారణం తాత (సంజయ్ దత్) అని తెలుసుకోవడం.. ఆ తాతకు సైకలాజికల్ (Psychological), బ్రెయిన్‌తో గేమ్ ఆడగలిగే సత్తా ఉందని తెలుసుకుని ప్రభాస్ అండ్ గ్యాంగ్ చివరకు ఏం చేశారు? ఎలా దుష్టశక్తిని అంతమొందించారు? అనేది కథ. మొత్తానికి ఒక హారర్ ఎలిమెంట్‌ని కామెడీతో మిక్స్ చేసి చెప్పడం ఆసక్తికరం. గతంలో ఇలా వచ్చిన కొన్ని చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో ప్రభాస్ మొసలితో చేసిన ఫైట్, దుష్టశక్తులతో పోరాడే తీరును చూపించిన విధానం ఆకట్టుకుంటోంది.
‘ఏందిరా మీ బాధ? పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమైనా చీమనా? రాక్షసుడిని..’ అంటూ ప్రభాస్ వింటేజ్ లుక్‌లో చెప్పే డైలాగ్ ఆయన క్యారెక్టర్‌ని హైలైట్ చేస్తోంది. ప్రభాస్ కామెడీ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. ప్రభాస్‌కు జోడిగా ముగ్గురు బ్యూటీఫుల్ హీరోయిన్స్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ది కుమార్ (Riddhi Kumar) నటించారు. ఒకరి పాత్రకు మరొకరి పాత్రకు సంబంధం లేకుండా ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 100 రోజుల ముందే మారుతి ట్రైలర్‌ను వదలడంతో మొత్తానికి సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రి ప్లాన్డ్‌గా గట్టి స్కెచ్‌తోనే వెళుతున్నట్టు తెలుస్తోంది.
ప్రజావాణి చీదిరాల