Varanasi: టైటిల్ గ్లింప్స్‌తోనే ఇంతలా తిప్పితే.. మిగిలిన అప్‌డేట్స్ మాటేంటి?
వాటే ఫోటోగ్రఫీ.. వాటే విజువల్స్.. చూసి తరించాల్సిందే. ఇంత ఇన్నోవేటివ్‌గా టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండియా.. అసలు ఇండియావైడ్‌గా టైటిల్ గ్లింప్స్ ఇప్పటి వరకూ వదల్లేదనే చెప్పాలి.
మహేశ్‌బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబోకి సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ అప్‌డేట్ రానే వచ్చేసింది. ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ చిత్ర బృందం ప్రత్యేక వీడియో విడుదల (#Globetrotter Video) చేసింది. ఆ వీడియో ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పించేదిగా ఉంది. ఈ చిత్రానికి ‘వారణాసి’ (Varanasi) అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారు. వారణాసి, ఆపై అంటార్కిటికాలోని రాస్ ఐస్ షెల్ఫ్‌తో గ్లింప్స్‌ను స్టార్ట్ చేశారు. వాటే ఫోటోగ్రఫీ.. వాటే విజువల్స్.. చూసి తరించాల్సిందే. ఇంత ఇన్నోవేటివ్‌గా టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండియా.. అసలు ఇండియావైడ్‌గా టైటిల్ గ్లింప్స్ ఇప్పటి వరకూ వదల్లేదనే చెప్పాలి.
టైటిల్ గ్లింప్స్‌లో ఆంజనేయస్వామిని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ఫైనల్‌గా మహేష్ ఎంట్రీ.. ఆపై వారణాసి టైటిల్. ఒక ఎద్దుపై ఏదో యుద్ధం చేస్తున్న వీరుడిలా చేతిలో త్రిశూలంతో దర్శనమిచ్చిన తీరు అద్భుతం. ఇంతకు మించిన ట్రీట్ ఫ్యాన్స్‌కు ఇంకేం కావాలి? విజువల్స్, నేపథ్య సంగీతం అన్నీ కలిసి గ్లింప్స్‌ని ఆకాశానికి ఎత్తేశాయి. ఒక్క టైటిల్ గ్లింప్స్‌తోనే రాజమౌళి అంటార్కిటికా మహా సముద్రంలోని రాస్ ఐస్ షెల్ఫ్ (Ross Ice Shelf - Antarctica), ఆఫ్రికా అంబోసెలి వైల్డర్‌నెస్ (Amboseli Wilderness - Africa), వన్నాంచల్ యూజీఆర్ అభట్టి కేవ్ (UGR Abhatti Cave), త్రేతాయుగం (Tretayugam)లోని లంకానగరంను చుట్టి అక్కడి నుంచి నేరుగా వారణాసిలోని మణికర్ణిక ఘాట్ (Manikarnica Ghat - Varanasi)కి తీసుకొచ్చి వదిలి.. అప్పుడు ఒక ఎద్దుపై మహేష్ వస్తున్న సీన్‌ను చూపించారు. అప్పుడు టైటిల్ వారణాసి (Varanasi) అని పడుతుంది.
ఒక్క టైటిల్‌తో రాజమౌళి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు? ఒకరకంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను చుట్టించేశారు. ఇక మున్ముందు అప్‌డేట్స్‌లో ఇంకెక్కడెక్కడ తిప్పుతారో చూడాలి. ఇక చూపించినవన్నీ కూడా వివిధ కాలమానాలకు సంబంధించినవే. ఒకటి 512సీఈలో మొదలు పెట్టి.. 2027 సీఈకి తీసుకొచ్చారు. అసలు రాజమౌళి ఏం చెప్పదలుచుకున్నారు? అనేది ఆసక్తికరం. పైగా త్రేతాయుగాన్ని సైతం టచ్ చేశారు. ఇదొక పిరియాడిక్ మూవీ అని తెలుసు కానీ వీటన్నింటినీ ఎలా ముడి పెట్టబోతున్నారనేదే ఆసక్తికరం. ఊహలకు అందకుండా ఉంది. ఏది ఏమైనా ఇండియన్ మూవీ హిస్టరీలో మరో సరికొత్త అధ్యాయానికి అయితే రాజమౌళి నాంది పలకబోతున్నారన్నది మాత్రం వాస్తవం. ఇక ఈ టైటిల్ రివీల్ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)లో భారీ స్థాయిలో జరిగింది. ముందుగా వేలాది అభిమానుల సమక్షంలో ప్రసారం చేసి, అనంతరం సోషల్ మీడియా (Social Media)లో టైటిల్‌ను విడుదల చేశారు.
ప్రజావాణి చీదిరాల