Entertainment

SSMB29: జక్కన్నా మజాకా? 120 దేశాలను లైన్‌లో పెడుతున్నారుగా..

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమీ వదలకుండా మేకర్స్ అయితే సినిమాపై తెగ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు.

SSMB29: జక్కన్నా మజాకా? 120 దేశాలను లైన్‌లో పెడుతున్నారుగా..

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమీ వదలకుండా మేకర్స్ అయితే సినిమాపై తెగ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. జక్కన్న (Jakkanna) మాత్రం గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం సినిమాను చకచకా రూపొందించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. తాజాగా మూవీ టీం కెన్యా (Kenya) దేశ మంత్రి ముసాలియా ముదావాదిని (Kenya Minister Musaliya Mudavadini)ని మర్యాదపూర్వకంగా కలిసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. టీం మొత్తాన్ని వెంటబెట్టుకుని వెళ్లి మరీ జక్కన్న అక్కడి మంత్రిని కలిశారు. వీరి భేటీకి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

జక్కన్న టీంతో భేటీ అనంతరం అందుకు సంబంధించిన పిక్స్‌ను కెన్యా మంత్రి ముసాలియానే షేర్ చేశారు. దీనికి ఆయన ఆసక్తికర పోస్టును జత చేశారు. అదేంటంటే.. సినీ ఇండస్ట్రీ (Cine Industry)లో రెండు దశాబ్దాలుగా రాజమౌళి అగ్రదర్శకుడిగా కొనసాగుతున్నారని ముసాలియా పేర్కొన్నారు. ఎన్నో పవర్‌ఫుల్ స్టోరీస్, విజువల్ వండర్స్‌తో కూడిన చిత్రాలను తెరకెక్కించారని.. లోతైన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో రాజమౌళి దిట్ట అని ముసాలియా ముదావాదిని రాసుకొచ్చారు. రాజమౌళి విషయానికి వస్తే ఎన్నో దేశాలను పర్యటించి సినిమాకి అవసరమైన 120 మందిని క్రూ లోకి తీసుకున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29)ను ఆసియాలోనే అతి పెద్ద మూవీగా తెరకెక్కిస్తున్నారు.

120 దేశాల్లో రిలీజ్ చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను మసాయిమరా మైదానాలు, నైవాషా, ఐకానిక్‌ అంబోసెలి వంటి ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా కెన్యాలో నిర్వహిస్తున్న షూటింగ్ అయితే చిత్రానికే మైలురాయిగా నిలవనుందని మేకర్స్ తెలిపారు. అయితే సినిమాలో కెన్యా అందాలనే కాకుండా ఆతిథ్యాన్ని సైతం చూపించనున్నారని తెలుస్తోంది. ప్రపంచానికి ఈ సినిమా ద్వారా కెన్యా చరిత్రను పరిచయం చేయనున్నారని సమాచారం. మొత్తానికి ఎస్ఎస్ఎంబీ 29ను రాజమౌళి గ్లోబల్ మూవీగా మార్చుతున్నారనడంలో సందేహం లేదంటూ టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాలో ఎన్ని దేశాల అందాలను రాజమౌళి చూపించనున్నారో చూడాలి.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 3, 2025 7:46 AM