Entertainment Breaking News

Raju Weds Rambai: ఇలాంటి దుర్మార్గం ఏ ప్రేమకథలోనూ జరగలే..

పరువు హత్యల గురించి మనం చాలా విన్నామని.. కానీ ఇలాంటి దుర్మార్గం మాత్రం ఏ ప్రేమకథలోనూ జరగలేదని తనకు అనిపించిందన్నారు. ఇది వాస్తవ ఘటన నేపథ్యంలో సాగే సినిమా అయినా దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసే విధానం..

Raju Weds Rambai: ఇలాంటి దుర్మార్గం ఏ ప్రేమకథలోనూ జరగలే..

అఖిల్ (Hero Akhil), తేజస్విని (Tejaswini) జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai). ఈటీవీ విన్ (Etv Win) ఒరిజినల్స్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సాయిలు కంపాటి (Sailu Kampati) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల (Venu Vudugula), రాహుల్ మోపిదేవి (Rahul Mopidevi) నిర్మించారు. ఈ క్రమంలోనే ఇవాళ (సోమవారం) జరిగిన ఇంటర్వ్యూలో నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తీయడం జరిగిందని వెల్లడించారు. ఈ సినిమాకు దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ అందజేసినట్టుగా వెల్లడించారు. సాయిలు తన దగ్గర పని చేస్తుండేవాడని.. ఆ సమయంలోనే తనకు కథను చెప్పాడని.. అది వినగానే తనను ఎంతగానో కలచివేసిందన్నారు. పరువు హత్యల గురించి మనం చాలా విన్నామని.. కానీ ఇలాంటి దుర్మార్గం మాత్రం ఏ ప్రేమకథలోనూ జరగలేదని తనకు  అనిపించిందన్నారు. ఇది వాస్తవ ఘటన నేపథ్యంలో సాగే సినిమా అయినా దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసే విధానం.. మెయిన్ స్ట్రీమ్ అప్పీల్ మాదిరిగా.. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందన్నారు. 

ఈ సినిమాకు తాను ప్రొడ్యూసర్ అయితేనే న్యాయం జరుగుతుందని నిర్మాతగా మారినట్టు వేణు వెల్లడించారు. అప్పటికే ఈటీవీ వాళ్లు తనను ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే అసోసియేట్ కమ్మని అడగటంతో తాను ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ గురించి చెప్పడంతో వాళ్లు కూడా ఈ సినిమా చేస్తామంటూ ముందుకు వచ్చారన్నారు. ఆ తర్వాత వంశీ నందిపాటి, బన్నీవాస్ వంటి వారంతా తమ సినిమాకు యాడ్ అయ్యారన్నారు. ఈ సినిమా కోసం కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఈ మూవీలో విషాదకరమైన ముగింపు ఉండదని.. ఒక మంచి ఫీల్‌తో ఎండ్ అవుతుందని వేణు ఉడుగుల తెలిపారు. తమ చిత్రాన్ని చూశాక అయినా అమ్మాయిల తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

ఈ సినిమాకు హీరో అఖిల్ త్వరగానే దొరికాడు కానీ అమ్మాయి విషయంలో చాలా వెదికామన్నారు. ఇది లోకల్, రూటెడ్ స్టోరీ కాబట్టి తెలుగు అమ్మాయినే తీసుకోవాలని భావించామని.. ఆ తరువాత ఒకరోజు తేజస్విని ప్రొఫైల్ చూసి వెంటనే ఓకే చేశామన్నారు. బేబి, 7జీ బృందావన్ కాలనీ, సైరత్, ప్రేమిస్తే మాదిరిగానే ఈ మూవీ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందన్నారు. తానొక ప్రొడ్యూసర్‌గా చేయాలని కాదని తెలిపారు. ఏదైనా మంచి కాన్సెప్ట్, పర్పస్ ఫుల్ కథ దొరికితే దాన్ని ప్రేక్షకులకు సరైన విధంగా చేర్చాలనే ప్రయత్నంలో నిర్మాతగా మారినట్టు వెల్లడించారు. తాను నిర్మాతగా మారాక కానీ తనకు ప్రొడక్షన్‌లో ఉన్న ఇబ్బందులేంటనేది తెలిశాయన్నారు.

నిర్మాత రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ..  ఓ ప్రేమ జంట జీవితంలో జరిగిన వాస్తవ ఘటన 15 ఏళ్లుగా అక్కడే సమాధి చేయబడిందని తెలిపారు. డైరెక్టర్ సాయిలు అదే ప్రాంతానికి చెందిన వాడు కాబట్టి దాని గురించి తెలుసుకుని దానికి మంచి డ్రామా యాడ్ చేసినట్టు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతంలోనే సినిమా షూటింగ్ జరిపామని.. కనీసం అక్కడ సెల్ సిగ్నల్స్ కూడా ఉండేవి కావని.. ఆ గ్రామంలోని వారినే కొన్ని చిన్న చిన్న పాత్రల కోసం తీసుకున్నామని వెల్లడించారు. హీరోయిన్ తేజస్విని ఏపీ అమ్మాయి అయినా కూడా తెలంగాణ యాసలో డైలాగ్స్ పర్‌ఫెక్ట్‌గా చెప్పిందన్నారు. ఈ సినిమాను ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల చేయనున్నట్టు రాహుల్ మోపిదేవి తెలిపారు. 

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 17, 2025 2:57 PM