OG Trailer: నిన్ను కలవాలని కొందరు.. చూడాలని ఇంకొందరు.. చంపాలని అంతా వెయిటింగ్..
ముంబై గ్యాంగ్ వార్ ఆధారంగా సినిమా ఉండబోతోందన్న విషయం తెలిసిందే. పవన్‌ను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించనున్నారు? కథను ఎంత మేర ఆసక్తికరంగా మలచారన్నది మాత్రం ట్రైలర్ చూస్తే..

‘ఓజీ’ ట్రైలర్ (OG Trailer) వచ్చేసింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) హీరోగా రూపొందిన ‘ఓజీ’ (OG) మరికొన్ని గంటల్లో థియేటర్లలో ప్రత్యక్షం కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ తాజాగా ‘ఓజీ’ ట్రైలర్ వదిలారు. ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజీత్ (Director Sujith) దర్శకత్వంలో రూపొందిన ఈ ట్రైలర్ చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేసే మాదిరిగానే కనిపిస్తోంది. ముంబై గ్యాంగ్ వార్ ఆధారంగా సినిమా ఉండబోతోందన్న విషయం తెలిసిందే. పవన్‌ను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించనున్నారు? కథను ఎంత మేర ఆసక్తికరంగా మలచారన్నది మాత్రం ట్రైలర్ చూస్తే కొంత క్లారిటీ వస్తోంది.
ట్రైలర్‌లో వింటేజ్ లుక్‌లో ప్రియాంక అరుల్ మోహన్ చాలా అందంగా కనిపిస్తోంది. దర్శకుడు సుజీత్ ఈ ట్రైలర్‌ను భారీ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాగా మలిచారని అర్థమవుతోంది. ‘నిన్ను కలవాలని కొందరు.. చూడాలని ఇంకొందరు.. చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు’ అనే డైలాగ్‌తో సినిమాపై ఆసక్తిని అయితే పెంచేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్-ఇమ్రాన్ హష్మీ (Imran Hashmi) పాత్రల మధ్య జరిగే వార్ వండర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ కానుందని ట్రైలర్ చెబుతోంది. మొత్తానికి ట్రైలర్ అయితే పవన్ ఫ్యాన్స్‌కు నచ్చేలానే ఉంది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.