Entertainment

They Call Him OG: ఒరొచి గెన్షిన్.. ఒజాస్ గంభీరగా ఎలా మారాడు? ‘ఓజీ 2’ పూర్తి కథేంటంటే..

అసలు జపాన్ (OG Japan Story) నుంచి గంభీర (OG Gambheera) ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చింది? అసలు జపాన్‌లో గంభీరకు ఎందుకు స్టాట్యూ పెట్టారు?

They Call Him OG: ఒరొచి గెన్షిన్.. ఒజాస్ గంభీరగా ఎలా మారాడు? ‘ఓజీ 2’ పూర్తి కథేంటంటే..

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ (They Call Him OG) చిత్రం విడుదలై మంచి సక్సెస్ సాధించింది. సుజీత్ (Director Sujeeth) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఇక సినిమా చివరిలో పార్ట్ 2 కూడా ఉంటుందన్న సంకేతాలను సుజీత్ ఇచ్చేశారు. దీంతో పార్ట్ 2పై చర్చ మొదలైంది. సినిమా ఎప్పుడు ఉంటుంది. కథ ఏమై ఉంటుంది? అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? అన్న విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. పార్ట్ 2 అయితే త్వరలోనే ఉండబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్టు టాక్. పార్ట్ 2కి సంబంధించిన కథ విషయమై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

‘ఓజీ’ స్టార్టింగ్, ఎండింగ్ రెండూ కూడా జపాన్ కీలకంగా మారింది. అసలు జపాన్ (OG Japan Story) నుంచి గంభీర (OG Gambheera) ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చింది? అసలు జపాన్‌లో గంభీరకు ఎందుకు స్టాట్యూ పెట్టారు? విగ్రహం పెట్టేంతగా అక్కడి ప్రజలకు గంభీర ఏం చేశాడు? ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లోనూ జపాన్‌లో గంభీరకు పెట్టిన స్టాట్యూ వైరల్ అవుతోంది. దానిపై పేరు ఒరొచి గెన్షిన్ (OG Orochi Genshin) అని ఉంది. అలాగే స్టాట్యూపై 1959 - 85 అని ఉంది. ఒరొచి 26 ఏళ్లపాటు జపాన్‌లో గడిపాడు. నౌక ఎక్కిన సమయంలోనూ ఒరొచి చిన్నవాడుగానే కనిపిస్తాడు. అంటే పాతికేళ్లకే జపాన్‌ను గడగడలాడించాడా? మరి ఒరొచి గెన్షిల్ తన పేరును ఒజాస్ గంభీరగా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది?

ఒరొచిని వెదుకుతున్న జపాన్ గ్యాంగ్ (Japan Gang) ఎవరు? వారెందుకు గంభీరకు అంత గొప్ప ఎలివేషన్ ఇస్తున్నారు? వంటి అంశాలతో పార్ట్ 2 రూపొందనుంది. మొత్తానికి ‘ఓజీ 2’ (OG2 Story) అయితే పూర్తిగా జపాన్ కథ ఆధారంగానే రూపొందనుందని సమాచారం. ముంబైకే సుజీత్ ఆ స్థాయిలో ఎలివేషన్స్ ఇస్తే జపాన్‌లో కథంటే ఇంక ఏ రేంజ్‌లో ఇస్తారో చూడాలి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ (OG Music Director Thaman) తమన్ ఓ రేంజ్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాకు ముఖ్యంగా తమన్ (Thaman) బీజీఎం ప్రాణమని చెప్పాలి. మరి జపాన్‌కు ఏ రేంజ్ బీజీఎం (OG BGM) ఇస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 1, 2025 6:42 AM