కాబోయే భర్తను పరిచయం చేసిన నివేదా.. అతను ఎవరంటే..
టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. వీరిద్దరి ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు కూడా ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పకనే చెప్పేసింది.

టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) పెళ్లి (Marriage) పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. తాజాగా సోషల్ మీడియా (Social Media) వేదికగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. వీరిద్దరి ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ (Engagement) జరిగినట్టు కూడా ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పకనే చెప్పేసింది. ‘ఇక మీదట జీవితమంతా ప్రేమమయమే’నంటూ ప్రియుడితో తీసుకున్న ఫోటోలతో పాటు లవ్ సింబల్స్, రింగ్ ఎమోజీ (Nivetha Pethuraj Engagement)ని సైతం తన పోస్టుకు నివేదా జోడించింది. ఈ ఫోటోలను చూసిన వారంతా ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ నివేదాకు కాబోయే భర్త ఎవరు అంటారా? సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చూసిన వారందరికీ మొదట వచ్చిన డౌట్ ఇదే..
నివేదాకు కాబోయే భర్త పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్. నెటిజన్లంతా (Netizens) ఇతనెవరు? ఏం చేస్తుంటారు? వంటి విషయాలను నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. రాజ్‌హిత్ ఇబ్రాన్ దుబాయ్‌లో వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారని సమాచారం. ఈ ఏడాది చివరిలో వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నారని తెలుస్తోంది. నివేదా ఎంగేజ్‌మెంట్ అంటే సైలెంట్‌గా కానిచ్చేసింది. మరి పెళ్లి మాటేంటి? అంటే అది కూడా కుంటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే చేసుకుంటుందని సమాచారం. వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది చూడాలి. నివేదా విషయానికి వస్తే.. 2016లో ‘ఓరు నాళ్ కోత్తు’ అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘మెంటల్ మది (Mental Madi)’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘చిత్రలహరి (Chitralahari)’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో (Ala Vaikuntapuramulo)’, ‘రెడ్’, ‘విరాటపర్వం (Virataparvam)’, ‘పాగల్ (Pagal)’, ‘దాస్ కా ధమ్కీ (Dass Ka Damki)’, ‘బ్లడీ మేరీ (Bloody Mery)’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
తన నటనతో నివేదాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీ గురించి చాలా మందికి తెలియని మరో విషయం.. ఆమె ఒక రేసర్. కార్ రేసింగ్‌లో ఆమె సత్తా చాటింది. అంతేకాదు.. మధురై (Madhurai)లో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్‌షిప్ పోటీలోని మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెపై కొద్ది రోజుల క్రితం రూమర్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin).. రూ.50 కోట్ల ఇంటిని నివేదాకు గిఫ్ట్‌గా ఇచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఆమె కోసం ఉదయనిధి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారంటూ కూడా వార్తలొచ్చాయి. విషయం నివేదా దృష్టికి వెళ్లడంతో ఆమె పెద్ద ఎత్తున ఫైర్ అయ్యింది. అవన్నీ అవాస్తవాలుగా కొట్టిపడేసింది. తప్పుడు వార్తలతో బుద్ధి లేని వ్యక్తులు కొందరు చేస్తున్న విష ప్రచారంగా నివేదా పేతురాజ్ పేర్కొంది.