Entertainment

Chaitanya Rao: న్యూ ఏజ్ లవ్ స్టోరీ స్టార్ట్

ఇటీవలి కాలంలో చైతన్యరావు (Actor Chaitanya Rao)ను వెదుక్కుంటూ ఎన్నో అవకాశాలొస్తున్నాయి. తాజాగా క్రాంతి మాధవ్ (Director Kranthi Madhav) దర్శకత్వంలో చైతన్య రావు మదాడి, ఐరా (Ira), సాఖీ (Sakshi) హీరో హీరోయిన్లుగా చిత్రం ప్రారంభమైంది.

Chaitanya Rao: న్యూ ఏజ్ లవ్ స్టోరీ స్టార్ట్

ఇటీవలి కాలంలో చైతన్యరావు (Actor Chaitanya Rao)ను వెదుక్కుంటూ ఎన్నో అవకాశాలొస్తున్నాయి. తాజాగా క్రాంతి మాధవ్ (Director Kranthi Madhav) దర్శకత్వంలో చైతన్య రావు మదాడి, ఐరా (Ira), సాఖీ (Sakshi) హీరో హీరోయిన్లుగా చిత్రం ప్రారంభమైంది. ఇప్పటికే ‘ఓనమాలు’; ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ (Malli Malli Idi Rani Roju) , ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover) వంటి పలు చిత్రాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు సరికొత్త కథను తెరకెక్కించే క్రమంలో ప్రొడక్షన్ నంబర్ 5 (Production No 5) ని ప్రారంభించారు. ఇవాళ (అక్టోబర్ 3) ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దేవా కట్టా (Deva Katta), కేఎల్ దామోదర్ ప్రసాద్ (KL Damodara Prasad), పూర్ణ నాయుడు (Purna Naidu) తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు క్రాంతి మాధవ్ (Director Kranthi Madhav) మాట్లాడుతూ .. ఇది తనకు ఐదో చిత్రమని.. చైతన్యతో రెండో చిత్రమని తెలిపారు. ఐరా హీరోయిన్‌తా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోందని తెలిపారు. శ్రీకాంత్, పూర్ణా నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు క్రాంతి మాధవ్ వెల్లడించారు. పూర్ణ, చైతన్యలతో తనది ఎన్నో ఏళ్ల అనుబంధమని పేర్కొన్నారు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తరువాత పూర్ణతో మూవీ చేయాల్సి ఉందని కానీ తాను బాధల్లో ఉన్నప్పుడు చేస్తానని అన్నట్టు తెలిపారు. అలా తన గత చిత్రం ఫ్లాప్ అయిన సందర్భంలో పూర్ణ సినిమా చేద్దామని అడగటం.. వెంటనే అంగీకరించడం జరిగిపోయాయని తెలిపారు. అలా న్యూ ఏజ్ లవ్ స్టోరీకి ప్లాన్ చేసినట్టు క్రాంతి మాధవ్ తెలిపారు.

హీరో చైతన్య రావు మాట్లాడుతూ .. క్రాంతితో తనది మూడేళ్ల అనుబంధమని.. ఆయనతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నట్టు తెలిపాడు. వచ్చే ఏడాది ఆయనతో చేస్తున్న రెండు చిత్రాలు విడుదల కానున్నాయని వెల్లడించాడు. క్రాంతి మాధవ్ తనకెంతో ఇష్టమైన దర్శకుడని.. ఆయనతో వరుసగా చిత్రాలు చేయడం ఆనందంగా ఉందని.. అంతకు మించి భగవంతుడిని ఏదీ కోరుకోనన్నారు. ‘మయసభ’, ‘ఘాటీ’ తరువాత ఇంత మంచి సినిమాను చేయడం తన అదృష్టమన్నారు. నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ .. క్రాంతితో పని చేసేందుకు ఇన్నాళ్లకు సమయం దొరికిందని.. ఆయన చెప్పే కథలంతే తనకు ఎంతో ఇష్టమన్నారు. శ్రీకాంత్ తన ప్రతి ప్రాజెక్టులో పార్ట్ అవుతూ ఉంటారన్నారు. హీరోయిన్ ఐరా మాట్లాడుతూ.. తనది బెంగుళూరు అయినా కూడా ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటామని తెలిపింది. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే చిత్రం తనకు చాలా ఇష్టమని.. దానిని దాదాపు 20 సార్లు చూసి ఉంటానని తెలిపింది. క్రాంతి గారి నుంచి ఫోన్ రావడంతో చాలా సంతోషించానని... కథ తనకు ఎంతగానో నచ్చిందని వెల్లడించింది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 3, 2025 4:03 PM