Big Breaking: యాడ్ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయాలు
స్టార్ హీరో ఎన్టీఆర్ షూటింగ్‌లో గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక యాడ్ షూటింగ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన కాలికి గాయమైంది. ముఖ్యంగా యాడ్‌లో యాక్షన్ సన్నివేశాల్లో..

స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) షూటింగ్‌లో గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక యాడ్ షూటింగ్ (Ad Shooting) చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన కాలికి గాయమైంది. ముఖ్యంగా యాడ్‌లో యాక్షన్ సన్నివేశాల్లో (Action Scene) నటిస్తుండగా ఆయన కిందపడిపోయారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే ఎన్టీఆర్‌ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్సను అందించిన మీదట కోలుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ (Jr NTR)కు రెండు వారాల పాటు విశ్రాంతిని వైద్యులు సూచించారు. ఈ ప్రమాదంపై ఎన్టీఆర్ టీమ్ (NTR Team) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
ఎన్టీఆర్ ఆరోగ్యం (NTR Health)పై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ అభిమానులు (NTR Fans) సోషల్ మీడియా (Social Media) వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ (Director Prashanth Neel)దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుత షెడ్యూల్‌లో ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ (Movie Shooting)కు కాస్త గ్యాప్ తీసుకుని యాడ్ షూటింగ్‌లో ఎన్టీఆర్ (NTR) పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రమాదం జరగడం గమనార్హం.