Pawan Kalyan OG: ఒకే ఫ్రేమ్‌లోకి మెగా ఫ్యామిలీ.. అల్లు అర్జున్ కూడా..
షో (They Call Him OG) ముగిసిన తర్వాత ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), చిరంజీవి (Chiranjeevi)

ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీ (Mega Family) మధ్య బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయినట్టుంది కదా.. ఒకటే ఒకటి లోపం. అంతకుముందు మెగా ఫ్యామిలీ నుంచి ఏదైనా ఫోటో బయటకు వస్తే దానిలో అల్లు ఫ్యామిలీ (Alllu Family) కూడా ఉండేది. ముఖ్యంగా అల్లు అర్జున్ (Icon Star Allu Arjun). కానీ మెగా ఫ్యామిలీ నుంచి చాలా కాలం క్రితమే అల్లు అర్జున్ (Allu Arjun) బయటకు వచ్చేశాడు. మెగా హీరో నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా మెగా ఫ్యామిలీ మొత్తం కలిసింది. దీనిలో ఇప్పుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిల్లలు అకీరా నందన్ (Akira Nandan), ఆద్య (Aadya) కూడా చేరిపోయారు. అకీరా సినిమాల్లోకి వస్తాడో.. లేదంటే రాజకీయాల్లోకి వస్తాడో కానీ తండ్రిని మాత్రం వదలడం లేదు. పవన్ ఎక్కడికి వెళ్లినా కూడా అంటిపెట్టుకునే ఉంటున్నాడు.
కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) కు దగ్గు, జ్వరం రావడం.. అవి తగ్గకపోవడంతో విశ్రాంతి కోసమని ఆయన హైదరాబాద్‌కు వచ్చేశారు. ఆయన నటించిన ‘ఓజీ’ (They Call Him OG) చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ మొత్తం.. చిత్ర యూనిట్ (OG Movie Unit)తో కలిసి సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో స్పెషల్ షో వేయించకుని వీక్షించారు. షో (They Call Him OG) ముగిసిన తర్వాత ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan), వరుణ్ తేజ్ (Varun Tej), సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej), వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), అకీరా, ఆద్య అంతా ఫోటోలో కనిపిస్తున్నారు.
ఈ ఫోటోలను చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Arjun Fans) మాత్రం ఒకింత ఆవేదన చెందుతున్నారు. ఆ మధ్య కాలం వరకూ ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా అల్లు, మెగా ఫ్యామిలీ (Allu and Mega Family) అంతా ఒక్కటేనన్నట్టుగా కలిసిపోయాయి. కానీ ఏం జరిగిందో ఏమో కానీ అల్లు అరవింద్ (Allu Arvind) మెగా ఫ్యామిలీతో సఖ్యంగానే ఉంటున్నారు. కానీ అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం దూరమయ్యాడు. ఏదైనా కలవాల్సిన సందర్భం వస్తే ఆ క్షణానికి కలిసి ఆ తరువాత ఎవరికి వారుగా ఉంటున్నారు. ప్రస్తుతం ‘ఓజీ’ సక్సెస్‌ను మెగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ మాత్రం కనీసం సోషల్ మీడియా (Social Media) వేదికగా అయినా విశెష్ చెప్పింది లేదు. ఇటీవలే అల్లు అర్జున్ నాయినమ్మ మరణించినప్పుడు అంతా కలిసినట్టే అనిపించారు. అల్లు అర్జున్ ఒక మెట్టు దిగి ‘ఓజీ’ విడుదలకు ముందు ఆల్ ది బెస్ట్ చెప్పడమో లేదంటే విడుదలయ్యాక శుభాకాంక్షలు చెప్పడమో చేసి ఉంటే బాగుండేది.
ప్రజావాణి చీదిరాల