Entertainment

Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’ కోసమంటూ మంచు మనోజ్ పోస్ట్.. నెట్టింట సెన్సేషన్

మంచు మ‌నోజ్‌.. రీఎంట్రీతో అదరగొట్టేస్తున్నారు. విభిన్న పాత్ర‌ల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేసిన పోస్ట్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ మనోజ్ ఏం పోస్ట్ పెట్టాడంటారా?

Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’ కోసమంటూ మంచు మనోజ్ పోస్ట్.. నెట్టింట సెన్సేషన్

మంచు మ‌నోజ్‌.. రీఎంట్రీతో అదరగొట్టేస్తున్నారు. విభిన్న పాత్ర‌ల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేసిన పోస్ట్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ మనోజ్ ఏం పోస్ట్ పెట్టాడంటారా? త‌న ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ గురించిన అప్‌డేట్‌ను ఆయ‌న షేర్ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం ఎంతలా శ్రమిస్తున్నాడో ఆ వీడియోల ద్వారా ఫ్యాన్స్‌కు తెలియజేశాడు. ఈ వీడియోస్ ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక వీడియోలో మనోజ్ చాలా నిజాయితీగా.. నిక్కచ్చిగా తాను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాడు.

సౌకర్యంగా ఉండేందుకు మనమంతా సాకులు వెతుకుతూ ఉంటాం. అయితే ఇక మీదట తాను సాకులు వెత‌కకుండా వాటిని ప‌క్క‌కు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. మూడు వారాల క్రితం నేనొక నిర్ణయం తీసుకున్నా. ఇక సౌకర్యంతో రాజీ పడటమో.. సాకులు చెప్పడం వంటివి చేయాలనుకోవడం లేదు. కేవలం కష్టం మాత్రమే,” అని ఆయన రాశారు. ఇదే క్ర‌మంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ న‌టించ‌లేరు. ప్రతి పంచ్, దెబ్బ త‌గిలిన‌ప్పుడు ప‌డిపోవ‌టం, ప్రతి దెబ్బకు మీ శ‌రీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు,” అని ఆయన అన్నారు.

ఇకపై కేవలం లుక్ కోసం కాకుండా.. శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తన పోకస్ ఉంటుందని మనోజ్ తెలిపాడు. ఈ అప్‌డేట్‌ను వీక్ 3గా పేర్కొన్న మనోజ్ తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని వెల్లడించాడు. కేవలం 21 రోజుల్లోనే తనలో చాలా మార్పు చూసుకుంటున్నట్టు వెల్లడించాడు. ‘మిరాయ్’తో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన మంచు మనోజ్.. ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హ‌నుమ రెడ్డి యెక్కంటి తెర‌కెక్కిస్తున్నారు. న‌ల్ల‌గంగుల వెంక‌ట్ రెడ్డి, భ‌ర‌త్ మోతుకూరి నిర్మిస్తున్నారు. 1897 - 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథలో అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఈ చిత్రం ద్వారా హనుమరెడ్డి చూపించనున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 11, 2026 10:43 AM