Entertainment

Keerthy Suresh: జగపతిబాబుకు సారీ చెప్పిన కీర్తి.. నమ్మాను కాబట్టే వ్యక్తిగత విషయాలు చెప్పా..

అయితే తాజాగా కీర్తి సురేష్.. ప్రముఖ నటుడు జగపతి బాబు (Jagapathi Babu)కు క్షమాపణలు చెప్పింది. పైగా తాను ఆయన్ను నమ్మానని అందుకే పర్సనల్ విషయాలను..

Keerthy Suresh: జగపతిబాబుకు సారీ చెప్పిన కీర్తి.. నమ్మాను కాబట్టే వ్యక్తిగత విషయాలు చెప్పా..

ఇండస్ట్రీలో మంచి నేమ్, ఫేమ్ ఉన్న హీరోయిన్స్‌లో కీర్తి సురేష్(Keerthy Suresh) ఒకరు. వివాహానంతరం కూడా ఏమాత్రం సినిమాలకు గ్యాప్ ఇవ్వడం లేదు. పైగా వెబ్ సిరీస్‌లు (web Series) సైతం చేస్తూ దూసుకెళుతోంది. అయితే తాజాగా కీర్తి సురేష్.. ప్రముఖ నటుడు జగపతి బాబు (Jagapathi Babu)కు క్షమాపణలు చెప్పింది. పైగా తాను ఆయన్ను నమ్మానని అందుకే పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం జగపతిబాబు హోస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే కార్యక్రమం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు పలువురు సినీ తారలు వచ్చి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఈ షోకు కీర్తి సురేష్ వచ్చింది. ఈ కార్యక్రమంలో తన పర్సనల్, కెరీర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను కీర్తి వెల్లడించింది. తన వివాహం ప్రేమ గురించి మాట్లాడుతూ.. తన ప్రేమ గురించి ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి తెలుసని.. వారిలో జగపతిబాబు కూడా ఒకరని వెల్లడించింది. తన పెళ్లి అయ్యేవరకూ కూడా తన ప్రేమ గురించి పెద్దగా ఎవరికీ చెప్పలేదని వెల్లడించింది. తను జగపతి బాబును నమ్మాను కాబట్టే తన పర్సనల్ విషయాలను వెల్లడించానని తెలిపింది. అయితే తన పెళ్లికి జగపతిబాబును ఆహ్వానించకపోవడం గురించి మాత్రం ఆయన్ను క్షమాపణలు కోరింది.

ఆంథోని తటిల్ (Anthony Tattle) తాను.. 15 ఏళ్ల పాటు ప్రేమించుకున్నామని.. అయితే వివాహం మాత్రం ఇరువైపుల పెద్దలకు చెప్పి వారి అంగీకారంలో మాత్రమే చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు కీర్తి సురేష్ వెల్లడించింది. ఆంథోని బిజినెస్ (Business) రీత్యా ఆరేళ్లు ఖతార్‌ (Qatar)లో ఉన్నారని.. తాను ఇండియా (India)లో ఉన్నానని తెలిపింది. ఖతార్ నుంచి ఆంథోని తిరిగి వచ్చాక ఇరువైపుల పెద్దలకు చెప్పాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. తామిద్దరం నాలుగేళ్ల క్రితమే ఇంట్లో చెప్పేశామని.. తన తండ్రి పెళ్లికి వెంటనే అంగీకరించారని తెలిపింది. ఇక తనకు నటుల్లో రజినీకాంత్ (Rajinikantha) అంటే ఎంతో ఇష్టమని.. కాలేజ్‌కు డుమ్మా కొట్టి ఆయన సినిమాలకు వెళ్లేదాన్నని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 13, 2025 10:17 AM