Rashmika Mandanna: వ్యక్తిగత విషయాలు ఆన్‌లైన్‌లో పంచుకోదట.. ఎంగేజ్‌మెంట్ గురించేనా?
మన వ్యక్తిగత జీవితాన్నేమో కెమెరా ముందుకు తీసుకెళ్లలేమంటూ చెప్పుకొచ్చింది. తాను ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిని కాదని తెలిపింది. ప్రజలు ఏమనుకున్నా తనకు సంబంధం లేదు.

ఇటీవలి కాలంలో ఏదో ఒకరకంగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) అయితే ట్రెండింగ్‌లో ఉంటూ వస్తోంది. అమ్మడు సీక్రెట్‌గా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఎంగేజ్‌మెంట్ (Vijay Devarakonda and Rashmika Engagement) చేసుకుందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. ఆ తరువాత తాజాగా అమ్మడిని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వినవస్తున్నాయి. ఇది ఇప్పుడే కాదు.. ‘కాంతార’ (Kanthara) సినిమా రిలీజ్ అయిన సమయంలోనే బాగా వినిపించాయి. అప్పట్లో ఈ సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిసింది. అన్ని ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందించారు. రష్మిక మాత్రం స్పందించిందే లేదు. అప్పట్లో ఆమెపై కన్నడ ఇండస్ట్రీ (Kannada Industry) నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం రష్మిక అప్‌కమింగ్ మూవీ ‘థామా’ (Thama) విడుదల సిద్దంగా ఉంది. ఈ క్రమంలోనే రష్మిక ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే తాను చూడలేనని.. ‘కాంతార’ కూడా అలాగే చూడలేకపోయానని తెలిపింది. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చూశానని ఆ వెంటనే చిత్ర బృందాన్ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశానని.. వాళ్లు తనకు ధన్యవాదాలు కూడా తెలిపారని వెల్లడించింది. తెరవెనుక జరిగేది ఎవరికీ తెలియదని.. మన వ్యక్తిగత జీవితాన్నేమో కెమెరా ముందుకు తీసుకెళ్లలేమంటూ చెప్పుకొచ్చింది. తాను ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిని కాదని తెలిపింది. ప్రజలు ఏమనుకున్నా తనకు సంబంధం లేదని.. కేవలం తన నటన గురించి మాట్లాడేదే తనకు ముఖ్యమని తెలిపింది. తనను ఇప్పటి వరకూ ఏ ఇండస్ట్రీ నిషేధించలేదని.. కేవలం అపార్థం వల్ల మాత్రమే ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తాయని రష్మిక వెల్లడించింది.
ఇదంతా ఓకే కానీ.. తన వ్యక్తిగత జీవితాన్ని కెమెరా ముందుకు తీసుకురాలేనని రష్మిక చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ రష్మిక ఏ విషయం గురించి మాట్లాడుతోంది? పైగా తన ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిని కానంటూ ముక్తాయింపు. ఇది సినిమా గురించేనా? తనపై రూమర్స్ వస్తున్నప్పుడు సినిమా గురించి స్పందించడమనేది వ్యక్తిగతమేమీ కాదు.. అలా అయితే చాలా మంది నటీనటులు సినిమాలపై అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎందుకు పంచుకుంటారు? ఆమె మాట్లాడింది ‘కాంతార’ మూవీ గురించి కాదని.. తన ఎంగేజ్‌మెంట్ గురించి అని కొందరు అంటున్నారు. వాస్తవానికి ఎంగేజ్‌మెంట్ అనేది ఆమె వ్యక్తిగతం.. కాబట్టే ఎవరతోనూ పంచుకోలేదని చెబుతోందా? ఈ ఎంగేజ్‌మెంట్ వార్త అంత సీక్రెట్‌గా ఉంచడానికి రష్మికనే కారణమా? అనేది ఇప్పుడు అంటే ఆమె వ్యాఖ్యల తర్వాత హాట్ టాపిక్‌గా మారింది.
ప్రజావాణి చీదిరాల