Entertainment

Dharma Mahesh: టీవీ5 మూర్తి వీడియోలు చూపించి హీరో ధర్మ సంచలన వ్యాఖ్యలు

తాజాగా మరో టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధర్మ మహేశ్.. ఈ విషయంపై కూడా స్పందించాడు. అలాగే టీవీ 5 మూర్తి గురించి కొన్ని వీడియోలు చూపించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Dharma Mahesh: టీవీ5 మూర్తి వీడియోలు చూపించి హీరో ధర్మ సంచలన వ్యాఖ్యలు

హీరో ధర్మ మహేశ్ (Hero Dharma Mahesh).. గౌతమి చిరుమామిళ్ల అలియాస్ గౌతమి చౌదరి (Gowthami Chowdary)ల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ డైవర్స్ కోసం కోర్టుకెక్కారు. ఆ తరువాత గౌతమి మీడియాలో ధర్మ మహేష్ (Dharma Mahesh), రీతూ చౌదరి (Rithu Chowdary)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియోలను బయటపెట్టి మరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిడ్ నైట్ 1 నుంచి మార్నింగ్ వరకూ రీతూ చౌదరి తన భర్తతో గడిపేసి వెళుతుంటుందని గౌతమి చెప్పింది. నైట్ పార్టీలు అయిపోయిన తర్వాత రీతూ చౌదరిని ధర్మ తెచ్చుకుంటాడని తెలిపింది. తాజాగా మరో టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధర్మ మహేశ్.. ఈ విషయంపై కూడా స్పందించాడు. రీతూ చౌదరితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు.

ఈ క్రమంలోనే గౌతమి గురించి కూడా అలాగే టీవీ 5 మూర్తి (TV5 Murthy) గురించి కొన్ని వీడియోలు చూపించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీవీ5 మూర్తి తన కుమారుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి.. తన ఇంట్లో తన ప్లేటులో భోజనం చేస్తూ రీల్ (Murthy Reel) తీసుకుంటున్న వీడియో ఒకటి ధర్మా మహేశ్ బయటపెట్టాడు. అసలు గౌతమిని ఎప్పుడూ తాను కలవలేదని చెప్పిన మూర్తి.. ఇదేంటని ధర్మ ప్రశ్నించాడు. తన ఇంట్లో మూర్తికి ఏం పనంటూ సదరు ఇంటర్వ్యూలో నిలదీశాడు. తనను మూర్తి జోలికి వెళితే అయిపోతావని అంటున్నారని.. రోడ్డుకి లాగుతాడని అంటున్నారని అంటున్నారు. గౌతమికి మూర్తి సపోర్ట్ ఉంటే ఏంటి? ఆయనేమైనా జడ్జి అంటూ ఫైర్ అయ్యాడు. తన ఇంటికి మూర్తి వెళ్లడం తప్పుగా భావించడం లేదని.. కానీ తన భార్యను ఒక్కసారే కలిశానని అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ధర్మా మహేష్ ప్రశ్నించాడు. తన లాయర్‌తో సహా అంతా టీవీ 5 మూర్తి గురించి భయపడుతున్నారని తెలిపాడు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 27, 2025 3:51 AM