Entertainment

Biggboss 9: బిగ్‌బాస్‌కి గౌతమి చౌదరి.. రీతూ పరిస్థితేంటో..!

రీతూ చౌదరి వర్సెస్ గౌతమి చౌదరి (Rithu Chowdary Vs Gowthami Chowdary) ఉంటుంది. షో ఒక్కసారిగా పైకి లేస్తుందనడంలో సందేహమే లేదు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి?

Biggboss 9: బిగ్‌బాస్‌కి గౌతమి చౌదరి.. రీతూ పరిస్థితేంటో..!

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బిగ్‌బాస్‌ షో (Biggboss Show)ను రసవత్తరంగా మార్చేందుకు బిగ్‌బాస్ టీం (Biggboss Team) అయితే చాలా కష్టపడుతోంది. వినూత్నంగా ప్రయత్నమైతే చేస్తోంది కానీ అంతగా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో వైల్డ్ కార్డ్స్‌ను ప్రవేశ పెట్టి ఆటలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కామన్ మ్యాన్ కేటగిరి (Common Man Category) నుంచి దివ్య నికిత (Divya Nikitha) హౌస్‌లోకి అడుగు పెట్టింది. ఇక ఇప్పుడు సెలబ్రిటీ కేటగిరి నుంచి హౌస్‌లోకి ఆరుగురు ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎవరెవరు బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది కూడా పేర్లు బయటకు వచ్చాయి.

ఇదిలా ఉండగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోయే వారిలో ఒక పేరు తాజాగా వినిపించీ వినిపించనట్టుగా వినిపిస్తోంది. ఆమె ఒక హీరో భార్య. ఆమె కానీ బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లో అడుగు పెడితే రచ్చ మామూలుగా ఉండదు. టీఆర్‌పీలు బద్దలైపోతాయి. మరి అంత ఇంపాక్ట్ చూపించే వ్యక్తి ఎవరంటారా? హీరో ధర్మ మహేష్ (Hero Dharma Mahesh) భార్య గౌతమి చౌదరి (Dharma Mahesh Wife Gowthami Chowdary). ఇప్పటికే ఈమె బయట ఎంత రచ్చ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన భర్త ధర్మతో రీతూ చౌదరికి సంబంధం ఉందంటూ సీసీ టీవీ ఫుటేజ్ బయట పెట్టి మరీ రచ్చ చేస్తోంది. ఆ వీడియోలో హీరో ధర్మతో కలిసి రీతూ ఫ్లాట్ నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉంది. అర్ధరాత్రి రీతూ తన భర్తతో కలిసి తమ ఇంట్లోకి వెళ్లి తెల్లవారుజామున బయటకు వస్తుందని ఆరోపిస్తోంది.

గౌతమి చౌదరి (Gowthami Chowdary)ని బిగ్‌బాస్ టీం ఇప్పటికే సంప్రదించిందని టాక్ వినిపిస్తోంది. అన్నీ ఓకే అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌతమి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెడుతుందట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం రీతూ చౌదరి వర్సెస్ గౌతమి చౌదరి (Rithu Chowdary Vs Gowthami Chowdary) ఉంటుంది. షో ఒక్కసారిగా పైకి లేస్తుందనడంలో సందేహమే లేదు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి? వాస్తవానికి బయట జరిగిందైతే రీతూకి తెలియదు. కానీ గౌతమి ఆమెను లైట్ తీసుకుని వదిలేంత సీన్ అయితే లేదు. మొత్తానికి బిగ్‌బాస్ మామూలు రసవత్తరంగా మారదు. వీరిద్దరి కోసమైనా షో చూసేవారి సంఖ్య పెరుగుతుంది. కానీ బిగ్‌బాస్ టీం ఈ గొడవంతా మాకెందుకులే అనుకుంటే మాత్రం గౌతమిని లైట్ తీసుకునే అవకాశం ఉంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో.. వచ్చే శని, ఆదివారాల్లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉంటుందని టాక్.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 6, 2025 8:23 AM