Draupadi 2: దక్షిణ భారత వైభవాన్ని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నమే ‘ద్రౌపది 2’
తనకు ఎన్నో అనుమానాలను ఆయన నివృత్తి చేశారన్నారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలవడం వల్లే ఈ తరహా మరిన్ని చిత్రాలను నిర్మించాలనే తన సంకల్పానికి బలాన్నిచ్చిందన్నారు.

ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా (Historical Action Drama)ను రూపొందించేందుకు అంతే హిస్టారికల్ పేరున్న వ్యక్తి నడుం బిగించారు. 14వ శతాబ్దం నాటి దక్షిణ భారత వైభవాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టుగా చూపించాలనే దర్శకనిర్మాతల తపనే సినిమాగా రూపుదిద్దుకుంది. సినిమాకు తాజాగా గుమ్మడికాయ కొట్టేశారు. ఇంతకీ ఏంటా సినిమా..? ఎవరా నిర్మాత అంటారా? సినిమా పేరు ‘ద్రౌపది 2’ (Draupadi 2). నిర్మాత వచ్చేసి చోళ చక్రవర్తి (Chola Chakravarthi). రిచర్డ్ రిషి (Richard Rishi) ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి మోహన్.జి (Director Mohan G) దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ నిన్న (సెప్టెంబర్ 23)తో ముగిసింది. సినిమా విశేషాలను దర్శక, నిర్మాతలు మీడియాకు వివరించారు.
ఈ చిత్రంలో ఇందుసుదన్ (Heroine Indusudhan) హీరోయిన్‌గా నటించగా.. నట్టి నటరాజ్ (Natti Nataraj), వై.జి. మహేంద్రన్, నాడోడిగల్ బరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దేవయాని శర్మ (Devayani Sharma), అరుణోదయన్ (Arunodayan) తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ.. సినిమా అనేది నిర్మాత మద్దతుతోనే పూర్తవుతుందని.. దర్శకుడు ఎంత ప్లాన్ చేసినా అది సాధ్యపడదని వెల్లడించారు. సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. వాటన్నింటినీ కూడా చోళ చక్రవర్తి ఇచ్చిన సపోర్ట్‌తోనే అధిగమించినట్టు పేర్కొన్నారు. ప్యాషన్, ఇష్టం, అనుభవం, కళ, విజన్ ఉన్న నిర్మాత కాబట్టే తొలి ప్రాజెక్ట్ అయినా కూడా అద్భుతంగా తీర్చిదిద్దామని మోహన్.జి తెలిపారు.
నిర్మాత చోళ చక్రవర్తి మాట్లాడుతూ ..దర్శకుడు మోహన్. జి సినిమాను తెరకెక్కించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని.. అందుకే అనుకున్న దానికంటే ముందుగానే షూటింగ్ పూర్తయిందన్నారు. తనకు ఎన్నో అనుమానాలను ఆయన నివృత్తి చేశారన్నారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలవడం వల్లే ఈ తరహా మరిన్ని చిత్రాలను నిర్మించాలనే తన సంకల్పానికి బలాన్నిచ్చిందన్నారు. దీనికోసం తనకు సహకరించిన మోహన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల