Maheshbabu: ఫోన్ స్విచ్చాఫ్ చేయకు.. మహేష్ ఎవరికి చెప్పారో తెలిస్తే..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వ్యక్తికి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయవద్దని చెప్పారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అసలెందుకు ఆయన అలా చెప్పాల్సి వచ్చిందో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh babu) ఓ వ్యక్తికి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయవద్దని చెప్పారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అసలెందుకు ఆయన అలా చెప్పాల్సి వచ్చిందో తెలుసుకుందాం. చిన్న సినిమాకు ప్రేక్షకకులు బ్రహ్మరథం పట్టారు. అదే ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) చిత్రం. ఈ సినిమా సాధారణ ప్రేక్షకులకే కాదు.. సెలబ్రిటీలకు సైతం నచ్చుతోంది. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు పలువురు సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా మహేష్ (Mahesh) సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్విటర్ (Twitter) వేదికగా పోస్ట్ పెట్టారు. మరి మహేష్ ఫోన్ స్విచ్చాఫ్ చేయవద్దంటూ ఎవరికి చెప్పారో తెలుసా? ‘లిటిల్ హార్ట్స్’ సంగీత దర్శకుడు సింజిత్ (Music Director Sinjith)ను ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టారు.
‘లిటిల్ హార్ట్స్’ చిత్రం ఆద్యంతం సరదాగా సాగే కామెడీ ఎంటర్‌టైనర్ అని మహేష్ తన ‘ఎక్స్’ (X) పోస్టులో పేర్కొన్నారు. నటీనటులంతా కొత్తవారే అయినా కూడా చాలా బాగా నటించి.. నవ్వుల రైడ్ చేసిన అద్భుతమైన చిత్రమని తెలిపారు. ఇక సింజిత్ (Sinjith)ను ఉద్దేశించి.. ఫోన్ స్విచ్చాప్ చేసి ఎక్కడికీ వెళ్లవద్దని.. దీనికి కారణం సింజిత్ కొద్ది రోజుల్లో చాలా బిజీగా మారిపోతావని మహేష్ వెల్లడించారు. చిత్రబృందానికి అభినందలు చెప్పారు. ప్రస్తుతం మహేష్ పోస్టును చూసి చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. అయితే మహేష్ సంగీత దర్శకుడి (Music Director)కి స్పెషల్‌గా అలా ఎందుకు చెప్పి ఉంటారంటారా? దీనికి కారణం ఇటీవల ఓ ఇంటర్వ్యూ (Interview)లో సింజిత్ మాట్లాడుతూ.. తాను మహేష్‌కు వీరాభిమానని.. ఆయన ‘లిటిల్ హార్ట్స్’ గురించి ఒక పోస్ట్ పెడితే తన ఆనందానికి అవధులుండవని తెలిపారు. అంతేకాకుండా ఆ ఆనందంలో పోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని ఎటైనా వారం పాటు వెళ్లిపోతానని తెలిపారు. ఇది మహేష్ దృష్టికి వెళ్లినట్టు ఆయన పోస్టును బట్టి తెలుస్తోంది. అందుకే సింజిత్‌కు ఫోన్ స్విచ్చాఫ్ చేయవద్దని చెప్పారు.
ప్రజావాణి చీదిరాల