Divvela Madhuri: వచ్చి గంటలు గడవకముందే కన్నీళ్లు పెట్టుకున్న దివ్వెల మాదురి..
దివ్వెల మాదురి (Divvela Madhuri)కి బిగ్‌బాస్ (Biggoss) బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చి హౌస్‌లోకి పంపించారు. కానీ వచ్చి కొన్ని గంటలు కూడా గడవక ముందే దివ్వెల మాదురి కంటతడి పెట్టుకున్నారు.

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu)లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఆరుగురు కంటెస్టెంట్స్ (wildcard Contestants) ఎంట్రీ ఇచ్చేశారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో దివ్వెల మాదురి (Divvela Madhuri) ఒకరు. బిగ్‌బాస్ (Biggoss) ఆమెకు బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చి హౌస్‌లోకి పంపించారు. కానీ వచ్చి కొన్ని గంటలు కూడా గడవక ముందే దివ్వెల మాదురి కంటతడి పెట్టుకున్నారు. దీనికి కారణమేంటి? అసలేం జరిగిందో చూద్దాం. దివ్వెల మాదురికి వచ్చీ రాగానే కిచెన్ సెక్షన్ అప్పగించారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం.. ఆమెను కెప్టెన్‌గా ఉన్న పవన్, దివ్య నికిత (Divya Nikitha) డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలిచారు. ఆమె రాగానే మర్యాదగా కూర్చోమన్నారు. ఏం కూర్చోకుంటే చెప్పరా? అని మాదురి అడిగారు. టైం ఇంత అయ్యింది కదా.. ఈ రోజైతే ఇలా ఉంది.. రేపటి నుంచి ఇలా ఉండదని పవన్ చెప్పాడు. దానికి మాదురి ‘నేనొచ్చి అరగంట కూర్చొన్నాను... అప్పుడేం చేశారు మీరు.. లేటవుద్దని అప్పుడు మీకు తెలియదా?’ అని అడిగారు.
‘మీరిలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది’ అని పవన్ చెప్పడంతో మాట్లాడండి అంటూ రెచ్చగొట్టేలా మాదురి అన్నారు. గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాత 15 నిమిషాల్లో రెడీ అయి కూర్చున్నానని ఆమె తెలిపింది. అప్పుడు దివ్య.. ‘మీరిక్కడ లేరు.. కుకింగ్ టీమ్ కూడా ఎవరూ లేరు’ అని చెప్పింది. ‘కుకింగ్ టీమ నేనొక్కదాన్నే కాదు. వేరే వాళ్లు కూడా ఉన్నారు’ అని దివ్వెల మాదురి.. మీరు మెయిన్ చెఫ్ అని చెబుతున్నాం.. మీరు మీ టీంకి చెప్పుకోండి’ అని దివ్య.. మీరు కూడా రేషన్ ముందుగానే అక్కడ పెట్టేయండి అని మాధురి.. మొత్తానికి గొడవ గట్టిగానే అయ్యింది. ఆ తరువాత పవన్‌ని ఉద్దేశిస్తూ.. వేరేలా మాట్లాడాల్సి వస్తుందంటే.. ఎలా మాట్లాడతారో మాట్లాడండంటూ దివ్వెల మాధురి అడగటం హౌస్ (Biggboss House) అందరికీ ఎవరి వర్షన్ వారు వినిపించడం వంటివి జరిగాయి. మొత్తానికి దివ్వెల మాదురి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత చిన్న దానికే కన్నీళ్లు పెట్టుకుంటే రేపు హౌస్‌లో గట్టిగా కొట్లాడాల్సి వస్తుంది. మరి దీనికి ఆమె ఏం చేస్తారో చూడాలి.
కొందరు అయితే ఇప్పుడు శ్రీజ (Srija) హౌస్‌లో ఉంటే బాగుండేదని అంటున్నారు. మాధురికి ఆమె అయితే కరెక్ట్‌గా సమాధానం చెబుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నెట్టింట శ్రీజ పేరు మారుమోగుతోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు దివ్య నికిత స్ట్రాంగ్‌గానే మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు పవన్ కూడా ఏమాత్రం తగ్గకుండా మాట్లాడటం ఆసక్తికరం. మొత్తానికి దివ్వెల మాదురి ఇలాగే ఉంటే హౌస్‌లో కొనసాగడం కష్టం. మాంచి యాటిట్యూడ్ చూపించినట్టుగా అనిపించిన ఆమె.. సడెన్‌గా కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. వాయిస్ ఏంటి రేజ్ అవుతోందంటూ పవన్ (Pawan Kalyan)పై మాదురి ఫైర్ అయిపోయింది. కూర అవ్వకపోతే నేను కూర్చొని వండాలా? అంటూ నిజంగానే ఫైర్ బ్రాండ్‌లా సమాధానం చెప్పారు దివ్వెల మాదురి. అంతలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రజావాణి చీదిరాల