Kalki 2898 AD: దీపికను ఎందుకు తప్పించారు? ఆమె ప్లేస్‌ను రీప్లేస్ చేసేది ఎవరు?
. ఈ ప్రకటన వచ్చిన వెంటనే నెట్టింట వైరల్‌గా మారింది. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీపిక స్థానంలో నటించనున్న నటి ఎవరు? అనేది

ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో వచ్చిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) చిత్రం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ (Amitabh Bachchan) వంటి భారీ తారాగణం నటించడంతో సినిమా పాన్ ఇండియా (Pan India) స్థాయిలో ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. విజువల్ వండర్ (Visual Wonder)గా రూపొందిన ఈ చిత్రానికి ప్రస్తుతం మేకర్స్ సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్‌కు సంబంధించి ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. సీక్వెల్‌లో దీపిక పదుకొణె ఉండదని.. వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) ప్రకటించింది. దీంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఈ న్యూస్ దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ (Bollywood)లో సైతం హాట్ టాపిక్‌గా మారింది.
అసలు వైజయంతి మూవీస్ సోషల్ మీడియా (Social Media) వేదికగా విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే.. ఒక లాంగ్ జర్నీ తర్వాత దీపికతో ‘కల్కి 2898AD’ సీక్వెల్‌లో కొనసాగలేకపోతున్నాం. సినిమాకు చాలా పెద్ద కమిట్‌మెంట్ అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే నెట్టింట వైరల్‌గా మారింది. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీపిక స్థానంలో నటించనున్న నటి ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. అలా నెట్టింట కొందరు ప్రముఖ హీరోయిన్ల పేర్లు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి మేకర్స్ అయితే ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త హీరోయిన్ పేరు కూడా బయటకు వచ్చిందంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
కండీషన్సే కారణమట..
అయితే దీపికను ఈ సినిమా నుంచి నిర్మాతలు తప్పించడానికి కారణం ఆమె పెట్టిన కండీషన్లేనని సమాచారం. గత కొంతకాలంగా దీపిక ఆమెతో సినిమా తీయాలనుకునే మేకర్స్‌కు తెగ కండీషన్స్ పెడుతోందట. ఈ క్రమంలోనే ఆమె సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ను సైతం మిస్ చేసుకుంది. అయినా కండీషన్స్ పెట్టడం మాత్రం మానడం లేదట. ఇంతకీ ఆమె పెడుతున్న కండీషన్స్ ఏంటంటారా? రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని.. రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేది లేదని.. ఇబ్బందికర సీన్స్ ఉంటే చేసేదే లేదని తెగేసి మరీ చెబుతోందట. ‘స్పిరిట్’ నుంచి సందీప్ రెడ్డి వంగా తప్పించినా.. ‘కల్కి’ సీక్వెల్ నుంచి మేకర్స్ తప్పించినా కారణాలు ఇవేనని నెట్టింట ప్రచారం జరుగుతోంది.