Entertainment

Cult Teaser: ఎక్కడో కొడుతోంది శీనా.. దాని నుంచి కాన్సెప్ట్ ఎత్తేశారా?

తాజాగా విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘కల్ట్’ టీజర్ విడుదలైంది. ఇదొక ప్రయోగాత్మక చిత్రమని టీజర్ చూసిన వారికి అనిపించకమానదు. పైగా మరో ఆలోచన కూడా వస్తుంది. అదేంటంటే.. ఈ ఎక్కడో కొడుతోంది శీనా అని అనిపిస్తుంది. అసలెందుకు అలా అనిపిస్తుందో.. ముందుగా టీజర్‌లో ఏముందో చూద్దాం.

Cult Teaser: ఎక్కడో కొడుతోంది శీనా.. దాని నుంచి కాన్సెప్ట్ ఎత్తేశారా?

యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇటీవలి కాలంలో ఎందుకోగానీ వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి దర్శకుడిగా కూడా సక్సెస్ అయిన విశ్వక్ కథలు ఎంచుకోవడంతో తడబడుతున్నాడు. అయితే తాజాగా ఆయన నటిస్తున్న ‘కల్ట్’ టీజర్ విడుదలైంది. ఇదొక ప్రయోగాత్మక చిత్రమని టీజర్ చూసిన వారికి అనిపించకమానదు. పైగా మరో ఆలోచన కూడా వస్తుంది. అదేంటంటే.. ఈ ఎక్కడో కొడుతోంది శీనా అని అనిపిస్తుంది. అసలెందుకు అలా అనిపిస్తుందో.. ముందుగా టీజర్‌లో ఏముందో చూద్దాం.

లా, లిమిట్స్ లేని అన్‌ లిమిటెడ్ పార్టీ పేరుతో యువతను గోవాకు ఆహ్వానిస్తారు. అక్కడికి పాసులు సంపాదించుకుని యువత మొత్తం వెళుతుంది. మొదట సరదాగా మొదలైన వేడుకలు క్రమంగా మలుపు తీసుకుంటాయి. హోలోగ్రామ్ రూపంలో ఓ వాయిస్ సడెన్‌గా కనిపించి గేమ్స్ ఆడాలని చెబుతుంది. ఆ గేమ్స్‌‌లో ఓడిన వారిని చంపేస్తుంది. దీంతో సినిమా స్లాషర్ థ్రిల్లర్ మోడ్‌‌లోకి వెళ్లడం.. హీరో ఎంట్రీ వంటి అంశాలతో చూసేందుకు ఆసక్తిగానే అనిపిస్తున్నా.. ఎక్కడో చూశామన్న ఫీల్ మాత్రం కలుగక మానదు.

ఇటీవలి కాలంలో స్క్విడ్ గేమ్ అని మూడు సీజన్లు వచ్చింది. దీని కాన్సెప్ట్‌ను పోలినట్టుగానే ‘కల్ట్’ టీజర్ ఉండటం విశేషం. అయితే స్క్విడ్ గేమ్‌లో డబ్బు ఇస్తామని చెప్పి అందరినీ ఒక ప్లేసుకు రప్పించి ఓ బొమ్మ సాయంతో గేమ్స్ ఆడించి ఓడిపోయిన వారిని చంపేస్తూ ఉంటారు. ఇక కల్ట్‌లో ఫన్, ఎంజాయ్‌మెంట్ కోసమని ఒక ప్లేసుకు పిలిపించి గేమ్స్ ఆడిస్తూ చంపేస్తుంటారు. కాన్సెప్ట్ అయితే స్క్విడ్ గేమ్ నుంచి తీసుకున్నట్టుగానే అనిపిస్తోంది. ఇక ట్రైలర్ వస్తే మరికొంత మేర క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 40 మంది కొత్తవాళ్లు వెండితెరకు పరిచయం కానున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 22, 2026 3:42 AM