Entertainment Breaking News

Biggboss Agnipariksha: ఇద్దరికి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్..

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అయితే అనిపించడం లేదు. ప్రస్తుతం 15 మందితోనూ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. బిగ్‌బాస్ సీజన్ 9లోకి ఎవరెళతారనే విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

Biggboss Agnipariksha: ఇద్దరికి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్..

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Biggboss Agnipariksha) ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అయితే అనిపించడం లేదు. ప్రస్తుతం 15 మందితోనూ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. బిగ్‌బాస్ సీజన్ 9 (Biggboss season 9)లోకి ఎవరెళతారనే విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అగ్ని పరీక్ష లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్‌ (Biggboss Contestats)కి షాక్ అయితే తగిలింది, బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లోకి 5 నుంచి 9 మంది బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళతారని టాక్.. అంతే తప్ప క్లారిటీ అయితే లేదు. బిగ్‌బాస్ నిర్వాహకులు సైతం బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంతమంది వెళతారనే విషయమై క్లారిటీ ఇస్తున్నది లేదు. ఈ క్రమంలోనే ఇద్దరు కంటెస్టెంట్స్‌కి బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఇంతకీ వారిద్దరూ ఎవరంటారా?

తప్పనిసరిగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళతారు అనుకున్న వ్యక్తి అందరికంటే ముందుగానే అగ్నిపరీక్ష నుంచే వెనుదిరిగారు. అతను ఎవరంటే ప్రసన్న కుమార్. మరో వ్యక్తి శ్వేత. వాస్తవానికి శ్వేతపై అంచనాలైతే లేవు కానీ ప్రసన్న కుమార్ మాత్రం ఇంట్రడక్షన్‌తోనే మార్కులు కొట్టేశారు. జ్యూరీ సైతం మారు మాట్లాడకుండా.. సెకండ్ థాట్ లేకుండా ఆయనను అగ్నిపరీక్షలోకి పంపారు. ముఖ్యంగా టాస్కుల్లో వీరిద్దరూ తేలిపోయారు. దీంతో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష నుంచి వీరిద్దరూ బయటకు వచ్చేశారు. శ్వేత అయితే ఏ టాస్క్‌లోనూ ఆమె అంత యాక్టివ్‌గా పెర్ఫార్మ్ చేసింది లేదు. అయితే ప్రసన్న కుమార్ అవుట్ అవడం మాత్రం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన కూడా టాస్క్‌లో పెద్దగా ప్రభావం అయితే చూపలేకపోయారు.

అయితే మరో మూడు రోజుల పాటు ఈ ఎలిమినేషన్స్ కొనసాగనున్నాయి. వారంతా బిగ్‌బాస్ నుంచి పూర్తిగా ఎలిమినేట్ అయినట్టు కాదు. ఆడియన్స్ ఓటిం (Voting)గ్ కీలకం. ఆడియన్స్ ఓటింగ్‌ను పరిగణలోకి తీసుకుని మాత్రమే హౌస్‌లోకి ఎవరిని పంపాలన్నది డిసైడ్ చేస్తారు. అదంతా పక్కనబెడితే.. ప్రస్తుతం ఆడిస్తున్న మాదిరిగానే బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లోనూ టాస్క్‌లుంటే మాత్రం ఈసారి బిగ్‌బాస్ అట్టర్‌ఫ్లాప్ అవుతుందనడంలో సందేహం లేదు. నిర్వాహకులు మాత్రం ఈసారి రణరంగమేనంటూ హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు కానీ మరి రణరంగంలా ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే బిగ్‌బాస్ సెలబ్రిటీ కంటెంట్ లిస్ట్ అయితే కన్ఫర్మ్ యిపోయింది. ఇక కామనర్స్ లిస్టే ఫైనల్ కావాల్సి ఉంది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 3, 2025 7:12 AM