Biggboss Agnipariksha: రియలా.. ఫేకా?
బిగ్‌బాస్ అగ్ని పరీక్ష అత్యంత పేలవంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ప్రస్తుతం హౌస్‌లోకి వెళ్లేందుకు చూడాలి కానీ త్యాగాలకు ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తానికే వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుంటున్నారు.

బిగ్‌బాస్ అగ్ని పరీక్ష (Biggboss Agnipariksha) అత్యంత పేలవంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ (Contestants) ప్రస్తుతం హౌస్‌లోకి వెళ్లేందుకు చూడాలి కానీ త్యాగాలకు ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తానికే వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుంటున్నారు. ఇక బిగ్‌బాస్ నిర్వాహకులు సైతం జ్యూరీతో ఒకరకమైన గేమ్ ప్లే చేయిస్తూ అగ్ని పరీక్షకు హైప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎపిసోడ్ (Episode) సైతం పేలవంగానే సాగింది. ఎక్కడా కూడా బిగ్‌బాస్ (Biggboss)లోకి ఎవరు అడుగు పెడతారనే ఆసక్తి ఏమాత్రం కనిపించడం లేదు. అగ్ని పరీక్ష అనేది పెట్టాం కాబట్టి ఏదో ఒక విధంగా నడిపించాలన్న ఆతృతే కనిపిస్తోంది. దీనిని పైకి లేపేందుకు జ్యూరీతో ఆడిస్తున్న నాటకాలు మరో హైలైట్.
ఇక ఇవాళ బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కూడా అంతంత మాత్రంగానే ఉంది. షాకీబ్, మనీష్, పవన్‌లతో లీడర్ (Team Leader) ఎవరు తీసుకుంటారంటూ మొదలు పెట్టారు. ఒక్కొక్కరు ఇద్దరు ఇద్దరు సెలక్ట్ చేసుకుని వారిలో లీడర్ ఎవరన్నది డిస్కస్ చేసి తేల్చుకోవాలి. మొత్తంగా వాల్లు తేల్చేసుకున్నారు. 15 మందిని ఐదు టీములుగా చేసి ఐదుగురు లీడర్స్‌ని పెట్టారు. ఆ టీములను బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్, వైట్, ఎల్లో టీంలుగా విభజించారు. ఆ తరువాత రియల్ ఆర్ ఫేక్ టాస్క్ పెట్టారు. దీనిలో రెడ్, గ్రీన్ టీములు చెరో రెండు పాయింట్లు తెచ్చుకోగా.. ఎల్లో, బ్లూ టీంలు చెరో పాయింట్, బ్లాక్ అండ్ వైట్ టీం పాయింట్స్ ఏమీ తెచ్చుకోలేదు. బ్లూ, రెండ్ టీంలకు టై అవడంతో అడిషనల్ టాస్క్ ఆడించి ఫైనల్‌గా బ్లూ టీం విన్ అని తేల్చారు.
బ్లూ టీం లీడర్ అయిన అనూష.. తన టీం తరుఫున బాగా ఆడిన హరీష్‌కి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ టీం నుంచే స్టార్ ప్లేయర్‌గా ప్రియా శెట్టిని జ్యూరీ ఎంపిక చేసింది. దీంతో ప్రియాకు కూడా ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం లభించింది. ఏమి టాస్కులో ఏమో ఎక్కడా కూడా కొంచెం కూడా ఇంట్రస్టింగ్‌గా అనిపించిందే లేదు. పైగా బిగ్ కన్ఫ్యూజన్. ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి నిలబెట్టి వారిలో సింగర్ (Singer) ఎవరో తేల్చాలట. ఎలా తేలుస్తారు? మరో ఇద్దరిని తీసుకొచ్చి వారిలో పెయింటర్ (Painter) ఎవరో తేల్చమన్నారు. ఇదసలు కనిపెట్టడం ఎలా సాధ్యం? సింగింగ్ మీదనో లేదంటే పెయింటింగ్ మీదనో ఏమైనా నాలెడ్జ్ ఉంటే ఏవో క్వశ్చన్స్ అడిగి తేల్చుతారేమో.. ఏదో కంటెస్టెంట్స్ అంతా ఏ, బీ రెండే ఆప్షన్స్ కాబట్టి ఒకటి ఎంచుకున్నట్టుగా అనిపించింది. అదే చేయాలి కూడా. లక్కీగా తగిలితే తగులుతుంది లేకుంటే లేదు. బిగ్‌బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్‌కో.. జ్యూరీకో కాదు.. చూసే ప్రేక్షకులకు అన్నట్టుగా ఉంది వ్యవహారం.