Entertainment Breaking News

Maremma: 'మారెమ్మ' నుంచి 'బావ బావ' వచ్చేసింది..

పల్లెటూరి మట్టి వాసనతో పాటు మోడరన్ మ్యూజిక్ లేయర్స్ మిక్స్ అయి ఎంతో మధురమైన అనుభూతిని ఈ పాట కలిగిస్తోంది ప్లజెంట్ ఫీల్‌ను అందించేలా ఈ పాట సాగే తీరు ఆకట్టుకుంటుంది.

Maremma: 'మారెమ్మ' నుంచి 'బావ బావ' వచ్చేసింది..

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. నూతన దర్శకుడు మంచాల నాగరాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే నేడు (సోమవారం) మేకర్స్ మారెమ్మ ఫస్ట్ సింగిల్ 'బావ బావ'ను రిలీజ్ చేశారు. ఈ పాటను ప్రశాంత్ విహారి స్వరపరిచారు.

పల్లెటూరి మట్టి వాసనతో పాటు మోడరన్ మ్యూజిక్ లేయర్స్ మిక్స్ అయి ఎంతో మధురమైన అనుభూతిని ఈ పాట కలిగిస్తోంది ప్లజెంట్ ఫీల్‌ను అందించేలా ఈ పాట సాగే తీరు ఆకట్టుకుంటుంది. శృతి రంజని తన స్వరంలో ఉన్న నేచురల్, రస్టిక్ టచ్‌తో పాటను మరో మెట్టు ఎక్కించారు. మాధవ్, దీపా బాలు మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ.. వారి యాక్టింగ్‌లో ఉన్న సహజత్వం, పల్లెటూరి అందమైన లోకేషన్స్ కలిసి విజువల్స్‌ ట్రీట్‌గా ఈ పాటను మార్చేశాయి. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 13, 2026 3:52 PM