Megastar Chiranjeevi: చిరు కోసం అనిల్ రావిపూడి ప్రయోగం.. గ్రాండ్ సక్సెస్
ఇక తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) మరో ప్రయోగం చేశారు. ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో ఆయన ఈ ప్రయోగం చేశారు. అది గ్రాండ్ సక్సెస్..

దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ (Mana Shankaravaraprasagaru) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా నుంచి స్టైల్ మార్చేశారు. సొంతంగా ప్రమోషన్స్ (Mana Shankaravaraprasagaru Movie Promotions) చేసుకోవడంతో పాటు.. సినిమా పాటల విషయంలో ఒక పెక్యులర్ వాయిస్ కలిగిన వారిని తీసుకొచ్చి మరీ పాడిస్తున్నారు. అలా టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయిన సింగర్ రమణ గోగుల (Ramana Gogula)ను తీసుకొచ్చి ‘సంక్రాంతికి వస్తున్నాం’లో ‘గోదారి గట్టు మీద రామ చిలుకవే’ సాంగ్ పాడించారు. ఆ పాట ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా అదే పాట వినిపించింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సాంగ్ ప్రపంచాన్ని ఒక ఆట ఆడుకుంది.
ఇక తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) మరో ప్రయోగం చేశారు. ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో ఉదిత్ నారాయణ్ (Udit Narayan)ను తీసుకొచ్చి పాడించారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ నిన్న దసరా సందర్భంగా వదిలారు. ఈ చిత్రంలో నయనతార (Nayanatara) హీరోయిన్‌గా నటించింది. ఆమె పాత్ర పేరు శశిరేఖ. అయితే చిరు మాత్రం ఆమెను ‘ఓయ్ మీసాల పిల్ల’ అని పిలుస్తారు. అప్పుడు శశిరేఖ వచ్చి ‘వాట్.. ఏమన్నావ్.. ఏదో తిట్టావ్?’ అంటుంది. దానికి చిరు.. ‘మీసాల పిల్ల అన్నాను. అదేం తిట్టు కాదులే.. మా ఊళ్లో పొరగబోతు పిల్లని క్యూట్‌గా మీసాల పిల్ల’ అని పిలుస్తారు. అని చెబుతారు. అక్కడి నుంచి పాట ప్రారంభమవుతుంది. పాట వినడానికి చాలా అద్భుతంగా ఉండేలా అనిపిస్తోంది. రెండు లైన్లు వింటుంటేనే గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. పాట పూర్తిగా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇప్పటికే సాంగ్ గ్లింప్స్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మొత్తానికి ఉదిత్ నారాయణను తీసుకొచ్చి చిరు కోసం అనిల్ రావిపూడి చేసిన ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. 10 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఈ చిత్రం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అనిల్ రావిపూడి‘మన శంకరవరప్రసాద్‌గారు’ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి (Sahu Garapati), సుష్మిత కొణిదెల (Susmita Konidela) గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ పాటకు సంబంధించి అనిల్ రావిపూడి ఒక ప్రమోషనల్ ప్రోమోను వదిలారు. దీనిలో అనిల్ రావిపూడి, ఉదిత్ నారాయణ్‌తో పాటు, భీమ్స్ (Bheems Ceciroleo) ఉన్నారు. ‘హల్ ఆల్ మీ అందరికో సర్‌ప్రైజ్’ అని అనిల్ రావిపూడి అనగానే.. ‘నమస్కారం నేను మీ ఉదిత్ నారాయణ్’ అని ఉదిత్ తనను తాను పరిచయం చేసుకుంటారు. అక్కడి నుంచి అనిల్ రావిపూడి ఏం చెబుదామన్నా కూడా అడ్డుపడి.. చిరు చిత్రాల కోసం గతంలో ఆయన పాడిన పాటలన్నీ పాడుతూ.. ఉంటారు. మేము మిమ్మల్ని లేపాలి. మేము మీకు ఎలివేషన్ ఇవ్వాలని అనిల్ చెప్పినా ఆయన వినరు. మొత్తానికి ప్రోమో అయితే చాలా హిలేరియస్‌గా ఉంది.
ప్రజావాణి చీదిరాల