అనిల్ రావిపూడి మేజిక్.. సంప్రదాయబద్దంగా చిరు..
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడికి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆయన సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ హాట్ కేకుల్లా మారుతున్నాయి.

‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam)’ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi)కి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆయన సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ హాట్ కేకుల్లా మారుతున్నాయి. అలాంటి అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తోడయ్యారంటే ఇంకెలా ఉంటుంది. మాంచి క్రేజీ టైటిల్‌తో ఇద్దరూ చకచకా షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్‌డేట్స్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఊరించి ఉసూరుమనిపించకుండా సమయానుసారంగా విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను అనిల్ రావిపూడి (Anil Ravipudi) పెంచేస్తున్నారు. ఈ సినిమా కోసం నయనతార (Nayanatara)ను హీరోయిన్‌గా ఎంచుకోవడం కూడా అనిల్ రావిపూడి వేసిన గుడ్ స్టెప్ అని చెప్పవచ్చు.
ఇక ఈ క్రేజీ కాంబో టైటిల్ ఏంటో తెలుసు కదా.. ‘మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankaravaraprasad Garu)’. చిరంజీవి అసలు పేరును టైటిల్‌గా పెట్టాలనుకున్న ఆలోచనే క్రేజీ.. అక్కడే అనిల్ రావిపూడి ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ఇక గ్లింప్స్‌లో ‘బాస్’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే బీజీఎం కానీ.. చిరు స్టైలిష్ లుక్ కూడా వండర్‌ఫుల్‌గా ఉంది. ఈ సినిమా కోసం ఇప్పటికే సంక్రాంతి (Sankranthi)ని లాక్ చేసేశారు. అసలు అనిల్ రావిపూడి సినిమాను మొదలు పెట్టడం నుంచి విడుదల చేసే వరకూ ప్రతి విషయంలోనూ ఎంత శ్రద్ధ చూపిస్తున్నారని ఇప్పటికే సినీ ప్రియులకు అర్థమైంది. సినిమా ప్రారంభం నుంచి ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇక ఇప్పుడు తాజాగా వినాయక చవితి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.
వినాయకచవితి (Vinayaka Chaturthi) సందర్భంగా అభిమానులకు పండుగ శుభాకాంక్షలు చెబుతూ మేకర్స్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ మెగాస్టార్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పండుగ కాబట్టి చిరు పద్ధగా పట్టు పంచెను ధరించి ఒక పడవపై నిలుచున్న స్టిల్‌ను పండుగ సందర్భంగా మేకర్స్ వదిలారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ప్రస్తుతం ఈ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇకపోతే అనిల్ రావిపూడి అప్‌డేట్‌ను విడుదల చేసినప్పుడల్లా చిరులోని సరికొత్త యాంగిల్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు. గ్లింప్స్ సమయంలో సూటు, బూటులో చిరు స్టైలిష్ లుక్ చూపించగా.. ప్రస్తుతం చిరుని చాలా సంప్రదాయబద్దంగా చూపించారు. మొత్తానికి అనిల్ రావిపూడి మేజిక్ అయితే చేస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల