Mufti Police: విడుదలకు సిద్ధమైన ఐశ్వర్య రాజేష్, అర్జున్‌ల ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఒక రచయిత హత్య నేపథ్యంలో కథ నడుస్తోంది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పర్సనల్ డ్రామాకు పెద్ద పీట వేయడం విశేషం. అంతేకాకుండా ఇటీవల పిల్లల పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం గురించి కూడా చర్చించడం జరిగింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam)తో మంచి సక్సెస్ కొట్టి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ఐశ్వర్య రాజేష్ (Ishwarya Rajesh).. తిరిగి మరోసారి తెలుగు ప్రేక్షకులను రంజింపజేసేందుకు సిద్ధమైంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ (Arjun Sarja)తో కలిసి ఆమె నటించిన తమిళ చిత్రం ‘తీయవర్ కులై నడుంగ’. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పర్సనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ‘మఫ్టీ పోలీస్’ (Mufti Police)గా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ (Dinesh Lakshmanan) దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని జియస్సార్ అర్ట్స్ బ్యానర్‌పై జి. అరుల్ కుమార్ (G Arul Kumar) ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ (Sri Lakshmi Jyothi Creations) ద్వారా ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ విడుదల చేస్తున్నారు.
ఒక రచయిత హత్య నేపథ్యంలో కథ నడుస్తోంది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పర్సనల్ డ్రామాకు పెద్ద పీట వేయడం విశేషం. అంతేకాకుండా ఇటీవల పిల్లల పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం గురించి కూడా చర్చించడం జరిగింది. సినిమా విడుదల నేపథ్యంలో శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్. బాలాజీ మాట్లాడుతూ... యాక్షన్ కింగ్ అర్జున్ - ఐశ్వర్య రాజేష్ అలియాస్ భాగ్యంలకు తెలుగునాట ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో ‘మఫ్టీ పోలీస్’ను విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతోపాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకముందని బాలాజీ తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అద్భుత అవకాశాన్ని తనకు అందించిన జి.అరుల్ కుమార్‌కు.. ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్‌లకు బాలాజీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రజావాణి చీదిరాల