Entertainment Breaking News

15 చిత్రాలు.. 15 కెమెరాలు.. కట్ చేస్తే 9 రికార్డులు..

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ సంచలనానికి తెరదీశారు. భీమవరం టాకీస్ పేరిట ఆయన ఒక సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే.

15 చిత్రాలు.. 15 కెమెరాలు.. కట్ చేస్తే 9 రికార్డులు..

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ సంచలనానికి తెరదీశారు. భీమవరం టాకీస్ పేరిట ఆయన ఒక సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే. తన సొంత నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటికే ఆయన 114 చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఒక ఆసక్తికర స్టెప్ తీసుకున్నారు. ప్రపంచ సినీ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఏకంగా 15 చిత్రాలకు శ్రీకారం చుట్టి టాలీవుడ్‌కు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.

15 చిత్రాలకు టైటిల్స్‌తో పాటు దర్శకుల వివరాలను సైతం మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా.. ఈ 15 చిత్రాలకు 15 కెమెరాలతో క్లాప్, స్విచ్ఛాన్, గౌరవ దర్శకత్వం చేయించి అందరితో ఔరా అనిపించుకున్నారు. ఈ చిత్రాలన్నింటినీ వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నాటికి పూర్తి చేసేలా రామ సత్యనారాయణ ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకేసారి 15 చిత్రాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించడమనేది వరల్డ్ రికార్డ్‌గా మారింది. దేశవ్యాప్తంగా పేరొందని 9 సంస్థలు ఈ 15 సినిమాల ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్‌లో నమోదు చేయడం విశేషం.

సినిమా - దర్శకుడు

జస్టిస్ ధర్మ - యండమూరి వీరేంద్రనాథ్

నాగపంచమి - ఓం సాయిప్రకాష్

నా పేరు పవన్ కల్యాణ్- జె.కె.భారవి

టాపర్ - ఉదయ్ భాస్కర్

కె.పి.హెచ్.బి. కాలని - తల్లాడ సాయికృష్ణ

పోలీస్ సింహం - సంగకుమార్

అవంతిక- 2 - శ్రీరాజ్ బళ్ళా

యండమూరి కథలు - రవి బసర

బి.సి. - బ్లాక్ కమాండో - మోహన్ కాంత్

హనీ కిడ్స్ - హర్ష

సావాసం - ఏకరి సత్యనారాయణ

డార్క్ స్టోరీస్ - కృష్ణ కార్తీక్

మనల్ని ఎవడ్రా ఆపేది - బి.శ్రీనివాసరావు

ది ఫైనల్ కాల్ - ప్రణయ్ రాజ్ వంగరి

అవతారం - డా: సతీష్

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 15, 2025 12:52 PM