Entertainment

Ishwarya Rai: 14 ఏళ్ల ఆరాధ్యకు నో మొబైల్.. అసలు రహస్యం ఏంటంటే..

నేటి కాలంలో రెండేళ్ల పిల్లాడు కూడా ఫోన్ చూస్తేనే అన్నం తింటున్నాడు. ఐదేళ్లు దాటకముందే స్మార్ట్‌ఫోన్ అడిగే స్థాయికి పిల్లలు చేరుకున్నారు. కానీ, కోట్లాది రూపాయల ఆస్తి, ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న బచ్చన్ కుటుంబంలో మాత్రం పరిస్థితి వేరు.

Ishwarya Rai: 14 ఏళ్ల ఆరాధ్యకు నో మొబైల్.. అసలు రహస్యం ఏంటంటే..

నేటి కాలంలో రెండేళ్ల పిల్లాడు కూడా ఫోన్ చూస్తేనే అన్నం తింటున్నాడు. ఐదేళ్లు దాటకముందే స్మార్ట్‌ఫోన్ అడిగే స్థాయికి పిల్లలు చేరుకున్నారు. కానీ, కోట్లాది రూపాయల ఆస్తి, ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న బచ్చన్ కుటుంబంలో మాత్రం పరిస్థితి వేరు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ వయస్సు ఇప్పుడు 14 ఏళ్లు. అయినా ఆమెకు ఇంకా సొంత మొబైల్ ఫోన్ లేదు. ఈ విషయాన్ని స్వయంగా అభిషేక్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అన్నీ అమ్మ ఫోన్ ద్వారానే!

అభిషేక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరాధ్యకు ఫోన్ ఇవ్వకపోవడం అనేది వారు ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. ఒకవేళ ఆరాధ్య స్నేహితులు ఎవరైనా ఆమెతో మాట్లాడాలనుకుంటే, వారు ముందుగా ఐశ్వర్య ఫోన్‌కే కాల్ చేయాలి. ఐశ్వర్య అనుమతితోనే ఆరాధ్య వారితో మాట్లాడుతుంది. ‘ఆమె వయసుకి తగినట్లుగా, మెచ్యూరిటీ లెవల్స్ పెరిగినప్పుడు మాత్రమే ఫోన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అప్పటి వరకు ఆమెకు డిజిటల్ ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిడి, పుకార్లు తెలియకూడదని భావిస్తున్నాం’ అని అభిషేక్ పేర్కొన్నారు.

పిల్లలకు ఫోన్ ఇస్తే ఏమవుతుంది?

నేటి సమాజంలో చిన్న వయసులోనే ఫోన్ ఇవ్వడం వల్ల పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. అతిగా స్క్రీన్ చూడటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. చిన్న విషయాలకే చిరాకు పడటం, మెదడు మొండిగా తయారవడం జరుగుతుంది. ఫోన్‌లో గేమ్స్, సోషల్ మీడియాకు అలవాటు పడి బయట ఆడుకోవడం, మనుషులతో నేరుగా మాట్లాడటం మర్చిపోతున్నారు. దీనివల్ల సామాజిక నైపుణ్యాలు దెబ్బతింటాయి. కంటి చూపు దెబ్బతినడం, నిద్రలేమి, ఊబకాయం వంటి సమస్యలు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి. ఇంటర్నెట్‌లోని లోతైన విషయాలు అర్థం కాని వయసులో, పిల్లలు తెలియకుండానే ప్రమాదకరమైన వ్యక్తుల, ముఖ్యంగా సైబర్ వేధింపుల బారిన పడే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

క్రమశిక్షణే నిజమైన ప్రేమ!

చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అడగ్గానే ఫోన్ ఇచ్చేయడం లేదా ఖరీదైన వస్తువులు కొనివ్వడమే ప్రేమ అనుకుంటారు. కానీ, బచ్చన్ కుటుంబం నేర్పుతున్న పాఠం ఏంటంటే.. పిల్లలకు ఏది కావాలో అది ఇవ్వడం కంటే, వారికి ఏది అవసరమో అది ఇవ్వడమే నిజమైన ప్రేమ. ఆరాధ్యకు ఫోన్ లేకపోవడం వల్ల ఆమె ఎక్కువ సమయం చదువుకు, పెయింటింగ్స్‌కు లేదా కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయిస్తోంది. ఫలితంగా ఆమె చాలా మెచ్యూరిడ్‌గా, ఆత్మవిశ్వాసంతో పెరుగుతోందని అభిషేక్ గర్వంగా చెబుతుంటారు. ‘ఆమె పెరిగిన తీరు చూస్తే ఐశ్వర్యకు క్రెడిట్ ఇవ్వాలి. ఎంత డబ్బు ఉన్నా, సెలబ్రిటీ హోదా ఉన్నా పిల్లలను ఎలా గ్రౌండెడ్ గా ఉంచాలో ఆమెకు బాగా తెలుసు’ అని ఆయన కొనియాడారు.

బచ్చన్ ఫ్యామిలీ ఒక రోల్ మోడల్..

చివరిగా.. ‘మా పిల్లవాడు మా మాట వినడం లేదు, ఎప్పుడూ ఫోనే చూస్తున్నాడు’ అని బాధపడే తల్లిదండ్రులందరికీ బచ్చన్ ఫ్యామిలీ ఒక రోల్ మోడల్. గ్లామర్ ప్రపంచంలో ఉండి కూడా తన కూతురిని డిజిటల్ ప్రపంచానికి దూరంగా, స్వచ్ఛంగా పెంచుతున్న ఐశ్వర్య, అభిషేక్‌ల నిర్ణయం అభినందనీయం. కఠినంగా ఉండటం అంటే పిల్లలను బాధించడం కాదు, వారి భవిష్యత్తును కాపాడటం అని ఈ జంట నిరూపిస్తోంది. ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. ఫోన్ చేతిలో పెడితే నిశ్శబ్దంగా ఉంటారని భావిస్తే, అది వారి భవిష్యత్తును సమాధి చేసినట్లే!

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 21, 2026 5:57 AM