Entertainment Breaking News

12A Railway Colony: సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఎంజాయ్ చేసే వారికి ఇదొక మంచి ట్రీట్

ఇలాంటి థ్రిల్లర్స్ ఎప్పుడు చేయలేదన్నారు. తొలిసారిగా ఇలాంటి జానర్ ట్రై చేస్తే బాగుంటుందనిపించిందన్నారు. ఇది ఎన్నో మల్టీ లేయర్స్ ఉండే కథ అని.. ఏ కథ ఎటు నుంచి ఓపెనై ఎండ్ అవుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

12A Railway Colony: సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఎంజాయ్ చేసే వారికి ఇదొక మంచి ట్రీట్

అల్లరి నరేష్ (Allari Naresh), కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) జంటగా రూపొందిన చిత్రం '12A రైల్వే కాలనీ' (12A Railway Colony). లవ్ స్టోరీకి సస్పెన్స్ థ్రిల్లర్‌ను జత చేసి ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నాని కాసరగడ్డ (Nani Kasaragadda) రూపొందించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మిస్టరీ మర్డర్స్ సిరీస్‌ చుట్టూ కథ తిరుగుతుంది. ఆద్యంతం ప్రతి పాత్ర అనుమానాస్పదంగానే అనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు మూఢనమ్మకాలు, హీరోకి ఎదురైన భయానక అనుభవాలతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇవాళ (మంగళవారం) ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ... ‘నా సామి రంగ’ సక్సెస్ తర్వాత నిర్మాత శ్రీనివాస్ తనతో మరో సినిమా చేయాలని అనడంతో కథ చూడమని చెప్పానన్నారు. చాలా కథలు విన్న మీదట ఈ కథను విన్నామని.. తాను గతంలో చాలా జానర్స్ చేశానని.. అయితే ఇలాంటి థ్రిల్లర్స్ ఎప్పుడు చేయలేదన్నారు. తొలిసారిగా ఇలాంటి జానర్ ట్రై చేస్తే బాగుంటుందనిపించిందన్నారు. ఇది ఎన్నో మల్టీ లేయర్స్ ఉండే కథ అని.. ఏ కథ ఎటు నుంచి ఓపెనై ఎండ్ అవుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నారు. డైరెక్టర్ నాని సినిమాని చాలా అద్భుతంగా తీశాడని.. తను ఈ నెల 13న పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని.. తనకు ఇచ్చే మ్యారేజ్ గిఫ్ట్ ఇదేనని అల్లరి నరేష్ తెలిపాడు. కామాక్షి చాలా నేచురల్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని... డిఓపి రమేష్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారని అన్నారు. తనకు కెరీర్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్.. ఈ చిత్రంలో చాలా ప్రత్యేకంగా మెలోడీస్ చేశారని వెల్లడించారు.

కామాక్షి మాట్లాడుతూ.. ఈ చిత్రం తన కెరీర్‌లో బెంచ్ మార్క్ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. తమ సినిమాకు నిర్మాతలు శ్రీనివాస్, షో రన్నర్ అనిల్, డైరెక్టర్ నాని, హీరో నరేష్ నాలుగు స్తంభాలని పేర్కొంది. వీళ్ళ నలుగురు వల్లే తాను ఈ సినిమాలో ఉన్నానని.. సినిమా తర్వాత అంతా తనను ఆరాధన అని పిలుస్తారనే నమ్మకం ఉందని కామాక్షి తెలిపింది. డైరెక్టర్ నాని మాట్లాడుతూ.. నవంబర్ 21 తర్వాత తన పేరు గట్టిగా వినిపిస్తుందని బలంగా నమ్ముతున్నట్టు వెల్లడించారు. సినిమా మీద చాలా చాలా నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ ... ఈ సినిమాలో తర్వాత ఏం జరుగుతుందనేది అనేది ఎవరూ ఊహించలేరని అన్నారు. తనకు ఒక డిఫరెంట్ మ్యూజిక్ చేయడానికి స్కోప్ ఇచ్చిన సినిమా ఇదని వెల్లడించారు.

షో రన్నర్ అనిల్ మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి కథ, కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వస్తోందన్నారు. ‘పొలిమేర’ సినిమాకి అంతా తనను ఎంతగానో ఆదరించారని.. ఇది కూడా ఒక డిఫరెంట్ చిత్రమవుతుందని అన్నారు. నరేష్ ఈ కథని అంగీకరించడం అదృష్టంగా భావిస్తున్నామని.. ఆయన అంగీకరించారు కాబట్టే డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని చూడబోతున్నారని వెల్లడించారు. నిర్మాతల సపోర్ట్‌తో ఈ సినిమాను ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా రూపొందించినట్టు వెల్లడించారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఇదొక మంచి ట్రీట్ కాబోతోందని అనిల్ తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 11, 2025 4:11 PM