YS Jaganmohan Reddy: నువ్వేం అధినేతవన్నా.. పార్టీ తగలడుతుంటే లంకలో ఏం పని?
ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీ కూకటివేళ్లతో సహా పడిపోయేందుకు సిద్ధంగా ఉంది.. అయినా సరే.. మాకు పట్టదు.. మేము ఆ లంకలోనే అదేనండీ యలహంక ప్యాలెస్‌లోనే ఉంటా అంటే ఎవరికి నష్టం?

ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీ కూకటివేళ్లతో సహా పడిపోయేందుకు సిద్ధంగా ఉంది.. అయినా సరే.. మాకు పట్టదు.. మేము ఆ లంకలోనే అదేనండీ యలహంక ప్యాలెస్‌లోనే ఉంటా అంటే ఎవరికి నష్టం? ఇలాంటి అధినేత ఉన్నందుకు పార్టీనే నమ్ముకుని బతుకుతున్న నేతలు, కార్యకర్తలు ఏం చేయాలి? ఒకప్పుడు రోమ్ నగరం తగలబడి పోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడని విన్నాం.. ఇప్పుడు మేము చూస్తున్నామని ఏపీ ప్రజానీకం అంటున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) యలహంక ప్యాలెస్ (Yelahanka Palace)లోనే కాలం వెళ్లదీస్తున్నారని టీడీపీ నేతలు (TDP Leaders) విమర్శిస్తుంటే.. వైసీపీ నేతలు (YCP Leaders) తలలు పట్టుకుంటున్నారు. అధినేతకు చెప్పలేక.. టీడీపీ విమర్శలకు ఆన్సర్ చేయలేక మౌనం వహిస్తున్నారు. ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వీటి కోసమే అధినేత జగన్ కోటను వదిలి తాడేపల్లికి వచ్చారు. వచ్చి రెండు రోజులు ఉండి.. పాడిన పాటే పాడి తిరిగి యలహంకకు వెళ్లిపోయారు. ఇంతకీ ఆ పాట ఏంటంటారా? ఇంకేముంది? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని..
నువ్వేమైనా చిన్న పిల్లాడివా?
అసెంబ్లీకి జగన్ వెళ్లలేదు సరే.. తన పార్టీ ఎమ్మెల్యేలనైనా వెళ్లనివ్వొచ్చు కదా.. ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా తర్వాత పట్టుమని రెండు సార్లు కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మొహం చూసి ఉండరు. ఏ ఎమ్మెల్యేకైనా అసెంబ్లీకి వెళ్లాలి. తమ నియోజకవర్గ సమస్యలపై చర్చించాలని ఉంటుంది కదా.. వారికి ఆ అవకాశమే లేకుండా జగన్ చేశారు. పోనీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాలేదు సరే.. శాసనమండలిలో ఉంది కదా.. మండలికి వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు కదా.. మరి వారికైనా దిశా నిర్దేశం చేయవచ్చు కదా.. అదీ లేదు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? ఇస్తే అసెంబ్లీ లేదంటే యలహంక అంటే ఎలా? వైఎస్ఆర్‌సీపీ (YSRCP) ఎల్పీ మీటింగ్‌లోనూ ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే అసెంబ్లీకి వస్తానంటూ మారాం చేస్తే ఎలా జగనన్నా? అని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నువ్వేమైనా చిన్న పిల్లాడివా? నాలుగు మొత్తి తీసుకెళ్లి అసెంబ్లీలోకి పంపడానికని ప్రశ్నిస్తున్నారు. తిరిగి ‘నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను జంప్’ అని యలహంకకు వెళ్లిపోవడమేంటని వైసీపీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.
తలో దిక్కు చూసుకుంటున్ననేతలు?
అంతేకాదండోయ్.. ఇలా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ బెంగుళూరు ప్యాలెస్‌కి వెళ్లడం 51వ సారని లెక్కలు తీసి మరీ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఆయన బెంగుళూరు నుంచి రారని.. అక్కడే ఉండిపోతారని వచ్చినా ఇలాగే చుట్టపు చూపుగా వచ్చి పోతుంటారని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇక జగన్‌తో పెట్టుకుంటే అయ్యేది కాదనుకున్నారో ఏమో కానీ పార్టీ నేతలంతా తలో దిక్కు చూసుకుంటున్నారని టాక్. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు జంప్. ముగ్గురు టీడీపీ పంచన చేరితే.. ఒకరు బీజేపీ పంచన చేరారు. ఇక వీరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలున్నారని టాక్. స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ (YCP)ని పూర్తిగా భూస్థాపితం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు డోర్స్ ఓపెన్ చేసిందని అంటున్నారు. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సైతం పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభ సభ్యుల్లో..
వైసీపీకి 30 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉండగా.. వారిలో కొందరు ఇప్పటికే పార్టీని వీడారు. మరికొందరు వీడే ఆలోచనలో ఉన్నారు. ఇక రాజ్యసభ విషయానికి వస్తే.. ఇప్పటికే విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), కృష్ణయ్య (Krishnaiah), బీద మస్తాన్ రావు (Beeda Mastan Rao), మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana) వైసీపీకి దూరమయ్యారు. విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకోగా.. మస్తాన్ రావు, మోపిదేవి టీడీపీలో చేరగా... క్రిష్ణయ్య బీజేపీలో చేరారు. ఇక మిగిలింది వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు. జగన్‌ను పక్కనబెడితే 10 మంది. వారిలో అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం (Rega Mastyalingam) వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని రెండు రోజులుగా బీభత్సంగా ప్రచారం జరుగుతోంది. ఆయనైతే తన కట్టె కాలే వరకూ జగన్‌తోనే ఉంటానని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో.. మున్ముందు పరిణామాలు ఎలా మారబోతున్నాయో చూడాలి.
ప్రజావాణి చీదిరాల